
ధనుష్ నుండి విడిపోయిన తర్వాత, ఐశ్వర్య రజనీకాంత్ ప్రేమ తమ పిల్లలు, తల్లిదండ్రుల ప్రేమను వెతుక్కొంటోంది. సూపర్ ష్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య 2004లో ధనుష్‌తో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు యాత్ర మరియు లింగ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సౌత్ సూపర్ స్టార్ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ తమ 18 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకేసారిగా ఇటు చలనచిత్ర పరిశ్రమలో, అటు దేశవ్యాప్తంగా మిలియన్ల హృదయాలను బద్దలు కొట్టేలా సంయుక్త ప్రకటన విడుదల చేసింది. అనుకున్నట్టుగానే విడిపోయారు.
అనంతరం ఎవరి జీవితంలో వారు బిజీ అయ్యారు. ఇటీవల ఐశ్వర్య రజినీ కాంత్ ఇటీవల కోవిడ్ పాజిటివ్ రాగా.. ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా తన జీవితం మరియు ప్రేమ గురించి స్పందించింది. హిందుస్థాన్ టైమ్స్.కామ్‌తో మాట్లాడుతూ ‘జీవితంలో మనం ఎదుర్కోవాలని నేను భావిస్తున్నాను. మనకు ఏది వచ్చినా మనం ఎదుర్కోవాలి. చివరికి, మనం ఏది కోరుకుంటామో అది మనకు వస్తుంది’ అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
ఇంకా.. ‘నేను నేర్చుకుంటున్నాను.. ప్రేమ అనేది చాలా సాధారణమైన భావోద్వేగం. ఇది ఒక వ్యక్తికి లేదా ఒక వ్యక్తిగత విషయాలతో సంబంధం లేదు. నేను మారుతున్నా కొద్దీ.. ప్రేమ నిర్వచనం కూడా నాతో మారుతూ వస్తోంది.. నేను మా నాన్నను ప్రేమిస్తున్నాను. నా పిల్లలను ప్రేమిస్తున్నాను. కాబట్టి, ప్రేమను ఏదో ఒక వ్యక్తితోనే ఆగిపోదు అని భావిస్తున్నాను’ అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇప్పుడిప్పుడే గత జీవితం నుంచి బయటికి వస్తున్నారు.