రానాని నమ్ముకున్న రకుల్.. పనవుతుందా..?

By AN TeluguFirst Published Dec 4, 2019, 3:05 PM IST
Highlights

రానా దగ్గుబాటికి చెందిన సెలబ్రిటీ మేనేజ్మెంట్ సంస్థ క్వాన్ తో రకుల్ అగ్రిమెంట్ చేసుకుంది. పలువురు యువ నటీనటుల కెరీర్ ప్లానింగ్ కి హెల్ప్ అవుతోన్న క్వాన్ సంస్థ రకుల్ కి ఏమైనా కలిసోస్తుందేమో చూడాలి. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్.. ఎంత త్వరగా ఇండస్ట్రీలో ఎదిగిందో అంతే త్వరగా డౌన్ ఫాల్ కూడా చవి చూసింది. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈ భామ ఎంతో బిజీగా ఉండేది. అలాంటి రకుల్ కి ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలే లేవు. 

వచ్చిన కొన్ని ఆఫర్లు కూడా అదృష్టాన్ని తీసుకురాలేకపోతున్నాయి. దీంతో ఆమె ఇప్పుడు హిందీ చిత్రాలపై దృష్టి పెట్టింది. తెలుగులో ఆఫర్లు లేకపోవడంతో రానా దగ్గుబాటికి చెందిన సెలబ్రిటీ మేనేజ్మెంట్ సంస్థ క్వాన్ తో రకుల్ అగ్రిమెంట్ చేసుకుంది.

పలువురు యువ నటీనటుల కెరీర్ ప్లానింగ్ కి హెల్ప్ అవుతోన్న క్వాన్ సంస్థ రకుల్ కి ఏమైనా కలిసోస్తుందేమో చూడాలి. ఈ సంస్థ ఒప్పందం చేసుకుంటే తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఆఫర్లు వచ్చేలా చూసుకుంటారు. ఇప్పటివరకు ఉన్న తన మేనేజర్లను తొలగించి తన కెరీర్ ప్లానింగ్ మొత్తం రకుల్ ఈ సంస్థకే అప్పగించింది.

సెక్స్ చేస్తున్నట్లుగా ఫోజులిస్తే.. కోట్లలో రెమ్యునరేషన్.. హీరోయిన్ కామెంట్స్

ఇటీవల ఆమె నాగార్జున నటించిన 'మన్మథుడు 2' సినిమాలో కనిపించింది. ఈ సినిమా రకుల్ పాత్ర పెద్దగా ఆకట్టుకోదు. పైగా యాంకర్ ఝాన్సీతో లిప్ లాక్ సీన్ లో నటించి షాక్ ఇచ్చింది రకుల్.

అవకాశాలు లేక సీనియర్ హీరోలతో కూడా నటించడానికి సిద్ధమవుతోంది. అయినప్పటికీ అమ్మడుకి అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. 
 

click me!