బాలీవుడ్ లో 'రాక్ స్టార్' సినిమాతో స్టార్ డం సంపాదించుకున్న నటి నర్గీస్ ఫక్రి ఆ తరువాత పెద్దగా సినిమాలు చేయలేదు. తన వ్యక్తిగత జీవితంలో సమస్యలు తలెత్తడంతో ఆమె సినిమాలకు దూరమయ్యారు. అయితే నర్గీస్ ఫక్రి బాలీవుడ్ లోకి రావడానికి గల కారణాలను వెల్లడిస్తూ ఓ ఇంటర్వ్యూ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. 

బాలీవుడ్ చిత్రాలలో సెక్స్ సన్నివేశాలు ఉండవు కాబట్టే ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తనకంటూ కొన్ని షరతులు, నియమాలు విధించుకుంటానని.. విలువలు కోల్పోయే పనులు, సినిమాలు ఎప్పుడూ చేయనని చెప్పారు.

ప్లేబాయ్ మ్యాగజైన్ అర్ధనగ్నంగా ఫోటోషూట్ లలో పాల్గొంటే కోట్లు ఇస్తామని చెప్పినా తన విలువల కోసం ఒప్పుకోలేదని వెల్లడించింది. తను మోడలింగ్ రంగంలో ఉన్న సమయంలో ప్లేబాయ్ మ్యాగజైన్ నిర్వాహకులు తన కాలేజ్ కి వచ్చారని.. అబ్బాయిలతో కలిసి సెక్స్ చేస్తున్నట్లుగా హాట్ ఫోజులిస్తూ ఫోటోషూట్ లలో పాల్గొంటే కోట్లలో రెమ్యునరేషన్ ఇస్తారని ఆఫర్ చేసినట్లు చెప్పింది.

వాళ్లు చెప్పినదానికి అంగీకరించి ఉంటే తనకు ఎంతో డబ్బు వచ్చేదని.. కానీ తను మాత్రం ఒప్పుకోలేదని వెల్లడించింది నర్గీస్. బాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషపడినట్లు.. ఈ ఇండస్ట్రీలో అయితే నగ్నంగా, సెక్స్ సీన్లలో నటించే అవసరం ఉందని చెప్పుకొచ్చింది. 

గతంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ వారసుడు ఉదయ్ చోప్రాతో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ అతడిని పెళ్లి చేసుకోవాలని భావించింది. కానీ కొన్ని కారణాల వలన వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుత నర్గీస్ మరో వ్యక్తితో డేటింగ్ చేస్తోంది.