నా ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టాడు.. షాకింగ్ ఘటనను బయట పెట్టిన కంగనా!

Published : Dec 04, 2019, 02:34 PM ISTUpdated : Dec 04, 2019, 03:42 PM IST
నా ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టాడు.. షాకింగ్ ఘటనను బయట పెట్టిన కంగనా!

సారాంశం

ఎంత పెద్ద హీరో అయినా, డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా.. ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా తను చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా చెబుతూంటుంది. తన జోలికి ఎవరైనా వస్తే అసలు ఊరుకోదు. సరైన సమాధానం చెప్పే వరకు విడిచిపెట్టదు. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనాకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోలతో సమానంగా తన సినిమాలకు మార్కెట్ జరిగే విధంగా చూసుకుంటుంది. తరచూ తన బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఎంత పెద్ద హీరో అయినా, డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా.. ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా తను చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా చెబుతూంటుంది. తన జోలికి ఎవరైనా వస్తే అసలు ఊరుకోదు. సరైన సమాధానం చెప్పే వరకు విడిచిపెట్టదు. అలాంటిది ఈ బ్యూటీ చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న ఓ షాకింగ్ ఘటనను బయటపెట్టింది. 

మన స్టార్ హీరోల జీవితంలో మైలురాయి చిత్రాలివే!

కంగనా చండీఘర్ లో చదువుకునే సమయంలో స్కూల్ కి వెళ్తున్నప్పుడు అబ్బాయిలు బైక్ లపై వచ్చి ఆడపిల్లలను ఎక్కడపడితే అక్కడ టచ్ చేసేవారట. ఓ బైకర్ తన దగ్గరకి వేగంగా వచ్చి వక్షోజాలపై కొట్టాడట. దాంతో ఆమె అక్కడే కళ్ళు తిరిగి పడిపోయిందట. దాదాపు ఐదు నిమిషాల వరకు స్పృహలోకి రాలేదట.

స్పృహ వచ్చిన తరువాత ఎవరు చూడలేదు కదా అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు తనకు అలాంటి ఘటన ఎదురైతే ఎవరైనా చూసుంటారేమో అని భయపడ్డానని.. కానీ ఇప్పుడు అలాంటి ఆలోచన వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొనే స్టేజ్ కి వచ్చినట్లు చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ 'తలైవి' అనే సినిమాలో నటిస్తుంది. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితజీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?