Vijaya Kanth: తీవ్ర అనారోగ్యంతో విజయకాంత్, ట్వీట్ చేసిన రజినీకాంత్

Surya Prakash   | Asianet News
Published : Jun 22, 2022, 08:01 AM IST
Vijaya Kanth: తీవ్ర అనారోగ్యంతో విజయకాంత్, ట్వీట్ చేసిన రజినీకాంత్

సారాంశం

తాజాగా విజయ్ కాంత్ ఆరోగ్యం మరింత విషమంగా మారినట్లుగా సమాచారం. మాట్లాడే సామర్థ్యం, తానుగా లేచి నిలబడే శక్తిని కోల్పోయి బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.  

డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ కాంత్ గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న సంగతి తెలసిందే.  దీంతో ఆ మధ్యన సింగపూర్, అమెరికాలో చికిత్స చేయించుకుని వచ్చారు. అయినా.. ఆయన ఆరోగ్య పరిస్థితులలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ప్రస్తుతం పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి, కోశాధికారి ప్రేమలతకు అప్పగించారు. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఆయన కోవిడ్ భారిన పడి కోలుకున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో సైతం విజయ్ కాంత్ ప్రసంగాలు చేయలేక చేతితో సైగలు చేస్తూ కనిపించారు. అప్పటి నుంచి విజయ్ కాంత్ కు సర్జరీ జరిగిన తర్వాత ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు.

అయితే తాజాగా మరో సర్జరీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సర్జరీతో ఆయన కుడి పాదం నాలుగు వేళ్లు తొలగించినట్లు వార్తలు గుప్పమన్నాయి. ఈ వార్తపై విజయకాంత్ పార్టీ సభ్యులు స్పందిస్తూ.. నాలుగు వేళ్లు తొలగించడమా అబద్దమని, రక్త ప్రసారం జరగడానికి ఒక వేలును మాత్రమే తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్నారని తెలిపారు. ఇక దీంతో ఆయన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.

ఇక విజయకాంత్ ఆరోగ్యం గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ ట్వీట్ చేశాడు . “నా అద్భుతమైన స్నేహితుడు త్వరగా కోలుకోని మళ్లీ మునుపటి కెప్టెన్ లా గర్జించాలని దేవుడ్ని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?