'దర్బార్' ఫిల్మ్ నగర్ టాక్.. ఇలా ఉందేంటి..?

By AN TeluguFirst Published Jan 4, 2020, 11:30 AM IST
Highlights

ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు దర్బార్ సినిమా ...యాక్షన్ వైజ్ కొత్త ఎపిసోడ్స్ తో ఉన్నా రొటీన్ రివేంజ్ డ్రామాతో నడుస్తుంది. ఫస్టాఫ్ చాలా ఇంట్రస్టింగ్ గా ఒక్కో ముడి వేసుకుంటూ వెళ్లారు. 

సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన తాజా చిత్రం దర్బార్‌. ఈ  సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. తెలుగులోనూ ఈ సినిమాను భారిగానే రిలీజ్ చేస్తున్నారు.రజనీకాంత్ తమిళంలోనే కాక తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అయితే ఈ మద్యకాలంలో ఆయన నటించిన సినిమా ఏదీ సరిగ్గా ఆడకపోవటంతో ఆ మార్కెట్ కలిసిరాకుండాపోయింది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్దితుల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతోంది. ఫిల్మ్ నగర్ టాక్ ఏమిటి, పొంగల్ ట్రీట్ అవుతుందా లేదా చూద్దాం.


ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు దర్బార్ సినిమా ...యాక్షన్ వైజ్ కొత్త ఎపిసోడ్స్ తో ఉన్నా రొటీన్ రివేంజ్ డ్రామాతో నడుస్తుంది. ఫస్టాఫ్ చాలా ఇంట్రస్టింగ్ గా ఒక్కో ముడి వేసుకుంటూ వెళ్లారు. అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి ఆ దమ్ము తగ్గిపోయింది. రజనీకాంత్, సునీల్ శెట్టి మధ్యన వచ్చే ఘర్షణ సీన్స్  బాగున్నాయి.  అయితే బయిట ప్రచారం జరుగుతున్నట్లుగా రజనీకాంత్ క్లాసిక్స్ భాషా, నరసింహా స్దాయి మాత్రం కాదు.

విజయ్ దేవరకొండ పేరెందుకు మార్చుకున్నాడో..?

రజనీకాంత్ పాత్రలో రెండు వేరియేషన్స్ ఉన్నాయి. హార్డ్ కోర్ రజనీ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. కానీ మిగతా వాళ్లకు ఇది ఆల్రెడీ చూసిన సినిమా అనిపిస్తుంది. దాంతో యావరేజ్ అయ్యే అవకాసం ఉందంటు్నారు. అయితే పేటలా ఈ సినిమా చతికిల పడదు,కొన్ని ఎపిసోడ్స్ మాస్ ని అలరిస్తాయి. అవి కనుక పడితే సినిమా లేస్తుంది. అయితే దర్బార్ ని చూసి అలవైకుంఠపురములో కానీ, సరిలేరు నీకెవ్వరు కానీ కంగారుపడాల్సిన అవసరం లేదు. వాటికి ఇది సమస్య కాదు. అయితే ఇది కేవలం ఫిల్మ్ నగర్ టాక్ మాత్రమే. ఇందులో నిజమెంత అనేది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
 
 ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో... నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో  కీర్తి సురేశ్‌తో పాటు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం విడుదల కాబోతోంది. రజనీ కుమార్తెగా నివేదా థామస్.. ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

click me!