'మా' వివాదం.. నరేష్ పై శివాజీరాజా సంచలన కామెంట్స్!

By AN TeluguFirst Published Jan 4, 2020, 10:45 AM IST
Highlights

రాజశేఖర్ ప్రవర్తన కారణంగా కార్యక్రమం ఒక్కసారిగా వేడెక్కింది. ఆయన చేసిన రచ్చపై సినీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో రాజశేఖర్ తన పదవి నుండి తప్పుకున్నారు. ఈ విషయంపై తాజాగా 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా స్పందించారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల 'మా' డైరీ ఆవిష్కరణలో రాజశేఖర్ కి సినీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబులకు మధ్య వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ ప్రవర్తన కారణంగా కార్యక్రమం ఒక్కసారిగా వేడెక్కింది.

ఆయన చేసిన రచ్చపై సినీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో రాజశేఖర్ తన పదవి నుండి తప్పుకున్నారు. ఈ విషయంపై తాజాగా 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా స్పందించారు. 'మా'కు నరేష్ లాంటి అద్యక్షుడు ఉండడం దురదృష్టకరమని అన్నారు. 'మా' డైరీ ఆవిష్కరణలో ఏదైతే చోటు చేసుకుందో అది చాలా దురదృష్టకరమని అన్నారు.

ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్లు.. సినిమా కోసం ఎంతకైనా..!

అందులోనూ ఇండస్ట్రీకి చెందిన పెద్దల ముందు సభ్యులు కొట్టుకున్నారని.. ఇలా ప్రవర్తించడంపై వారే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. రాజశేఖర్ చాలా ఎమోషనల్ గా ఉండే వ్యక్తి అని.. ఆయన అసోసియేషన్ కి పది లక్షలు ఇచ్చారు కానీ దాని గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదని అన్నారు.

ప్రస్తుతం 'మా'కు అద్యక్షుడిగా వ్యవహరిస్తోన్న నరేష్ కి ఫండ్స్ గురించి అవగాహన లేదని.. అధ్యక్షుడికే ఫండ్స్ గురించి తెలియకపోతే ఎలా అని ప్రశ్నించాడు. 'మా'కి అలాంటి అద్యక్షుడు ఉండడం దురదృష్టకరమని అన్నారు.

'మా' ఎన్నికలు జరిగిన సమయంలో నరేష్ ప్యానెల్ కి, శివాజీ ప్యానెల్ కి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ సమయంలో శివాజీరాజా.. నరేష్ పై చాలానే విమర్శలు చేశారు. నరేష్.. నాగబాబు సపోర్ట్ తో గెలిచారని నాగబాబుని కూడా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు.  

click me!