మహేష్ సినిమాలో పీవీపీకి వాటా.. ఎంతంటే..?

By AN TeluguFirst Published Oct 25, 2019, 5:13 PM IST
Highlights

దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా పీవీపీతో సినిమా చేయకుండా దిల్ రాజు దగ్గరకు వెళ్లాడు. దీంతో వారి కాంబినేషన్ లో వచ్చిన 'మహర్షి' సినిమాను నిర్మాత పీవీపీ కోర్టు ద్వారా అడ్డుకొని గొడవ చేయడంతో 'మహర్షి' చిత్ర నిర్మాతల్లో ఆయన పేరు చేర్చక తప్పలేదు.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రముఖ నిర్మాత పీవీపీ 'బ్రహ్మోత్సవం' సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే మహేష్ తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసుకునే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. అలానే దర్శకుడు వంశీ పైడిపల్లితో కూడా అలాంటి అగ్రిమెంట్ చేసుకున్నారు. 

కానీ బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ కావడంతో పరిస్థితులు మారిపోయాయి. ఆ సినిమాతో పీవీపీ బాగా నష్టపోయారు. నష్టపోయిన నిర్మాతను మహేష్ ఆడుకుంటాడని అనుకున్నారు కానీ జరగలేదు. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా పీవీపీతో సినిమా చేయకుండా దిల్ రాజు దగ్గరకు వెళ్లాడు.

పవన్ కళ్యాణ్ పై వర్మ అసభ్యకర పోస్ట్.. సభలో వారి మధ్యలో ఉన్నట్లుగా!

దీంతో వారి కాంబినేషన్ లో వచ్చిన 'మహర్షి' సినిమాను నిర్మాత పీవీపీ కోర్టు ద్వారా అడ్డుకొని గొడవ చేయడంతో 'మహర్షి' చిత్ర నిర్మాతల్లో ఆయన పేరు చేర్చక తప్పలేదు. పేరుకి 'మహర్షి' సినిమా నిర్మాత అయినా.. ఆ సినిమాతో పీవీపీ నష్టమే తప్ప లాభం మాత్రం లేదు. తన వడ్డీకి తానే పెట్టుబడి పెట్టినట్లైంది.

నైజాం, కృష్ణ, వైజాగ్ ఏరియా హక్కులు ఉంచుకున్నా.. లాభాలు మాత్రం మిగల్లేదు. మొత్తం మీద 'మహర్షి' సినిమా నిర్మాత పీవీపీకి రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు వంశీ పైడిపల్లి - దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన మరో సినిమాలో కూడా పీవీపీకి వాటా ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తం సినిమాలో యాభై శాతం వాటా పీవీపీకే ఉన్నట్లు బోగట్టా. ఆ లెక్కన ఈ సినిమాకి నిర్మాతలుగా దిల్ రాజు, పీవీపీ ఇద్దరి పేర్లు ఉంటాయని తెలుస్తోంది. ఈసారి మాత్రం మహేష్ బాబు బ్యానర్ పేరు ఉండకపోవచ్చని తెలుస్తోంది. 

 

click me!