బన్నీ, ఎన్టీఆర్ పై రౌడీ హీరో కామెంట్స్.. చాలా కష్టపెట్టాడట!

By tirumala ANFirst Published Oct 25, 2019, 4:52 PM IST
Highlights

అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. భారీస్థాయిలో యువత విజయ్ దేవరకొండకు అభిమానులయ్యారు. తనప్రత్యేకమైన యాటిట్యూడ్ తో విజయ్ దేవరకొండ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

హీరోగా బిజీగా గడుపుతూనే విజయ్ దేవరకొండ నిర్మాతగా కూడా అవతారం ఎత్తాడు. విజయ్ దేవరకొండ ఫస్ట్ ప్రొడక్షన్ లో వస్తున్న చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. పెళ్లి చూపులు ఫేమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచేలా విజయ్ దేవరకొండ కూడా ప్రమోషన్స్ లోకి దిగాడు. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో ఓ సాంగ్ లో పెర్ఫామ్ చేశాడు. నువ్వే హీరో అంటూ రైల్వే స్టేషన్ నేపథ్యంలో సాగే ఈ పాటని ఇటీవల లాంచ్ చేశారు. 

ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ చాలా వెరైటీగా ఉంది. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సాంగ్ లో పెర్ఫామ్ చేయడం అంత ఈజీగా ఏమీ జరగలేదు. నా కొరియోగ్రాఫర్ ని చాలా కష్టపెట్టాను. నా కంటే ఎక్కువగా అతడే శ్రమ పడ్డాడు. 

తారక్ అన్న, బన్నీ అన్న చాలా ఈజీగా డాన్స్ చేస్తారు. నాకు మాత్రం ఈ పాటలో డాన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించింది అని విజయ్ దేవరకొండ తెలిపాడు. షమీర్ సుల్తాన్ దర్శత్వంలో తెరకెక్కుతున్న మీకు మాత్రమే చెప్తా చిత్రంలో వాణి భోజన్ కథానాయికగా నటించింది. అనసూయ కీలక పాత్రలో నటించింది. 

 

click me!