మహేష్ బాబు, విజయశాంతి కనిపిస్తే అంతే.. ట్రైన్ లో 30 నిమిషాలు!

Published : Dec 31, 2019, 08:23 PM IST
మహేష్ బాబు, విజయశాంతి కనిపిస్తే అంతే.. ట్రైన్ లో 30 నిమిషాలు!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని షురూ చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని షురూ చేసింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి వచ్చిన పాటలకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

మహేష్ కు జోడిగా ఈ చిత్రంలో రష్మిక మందన నటిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక ఏకంగా మహేష్ కు హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అనిల్ రావిపూడి ఈ చిత్రంలో మహేష్ ని ఆర్మీ మేజర్ గా చూపిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్న మరో అంశం ఏంటంటే.. చాలా ఏళ్ల తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. 

ప్రొఫెసర్ భారతిగా విజయశాంతి పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తోంది. తాజాగా ఇంటర్వ్యూలో ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ విజయశాంతి పాత్ర గురించి ఆసక్తికర సమాచారం అందించారు. సినిమాలో మహేష్, విజయశాంతి కలసి కనిపించిన ప్రతి సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి విజిల్స్, క్లాప్స్ పడతాయని అన్నారు. 

క్లాప్స్, విజిల్స్ పడకుంటే ఆ సన్నివేశం ఎమోషనల్ గా ఉందని అర్థం. అక్కడ ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటారు. ఇలా వారిద్దరూ కనిపించిన ప్రతి సీన్ కు ఆడియన్స్ నుంచి ఏదో విధంగా అద్భుతమైన రెస్పాన్స్ ఉంటుందని అన్నారు. 

మళ్ళీ ఎన్టీఆర్ సున్నా.. ఫ్యాన్స్ కు తప్పని నిరాశ!

సరిలేరు నీకెవ్వరు చిత్రం సైనికులకు ట్రిబ్యూట్. ఈ చిత్రం ద్వారా అనిల్ రావిపూడిలో కొత్త యాంగిల్ దర్శకుడిని చూస్తారు. ఈ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి వేరే లెవల్ కు వెళ్ళిపోతారు అని అనిల్ సుంకర తెలిపారు. ఇక ఈ చిత్రంలో మరో హైలైట్ ట్రైన్ ఎపిసోడ్. 30 నిమిషాలపాటు ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆ ఎపిసోడ్ కు సర్ ప్రైజ్ అవుతారని అనిల్ సుంకర అన్నారు. 

మళ్ళీ చిరంజీవి టైటిలే.. డైరెక్టర్ వాడకం మామూలుగా లేదుగా!

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?