Pushpa:ప్రమోషన్స్ తగ్గించటం వెనక బన్ని షాకిచ్చే స్ట్రాటజీ

By Surya Prakash  |  First Published Dec 14, 2021, 2:19 PM IST

ఒక సుకుమార్‌.. రెండు సంవత్సరాలకు జరిగే మహా అద్భుతం. అల్లు అర్జున్‌..  తపన పడుతున్న విశ్వరూపం. నా కలల ప్రతిరూపం. దేవిశ్రీ ప్రసాద్‌.. మూడో దశాబ్దంలోనూ మన కర్ణభేరిపై కూర్చొని వాయిస్తున్న ఓ మధుర మృదంగం. 



 అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’.బడా సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందులో ‘పుష్ప’ ఒకటి. బన్నీ -సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. రష్మిక హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడింది. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ జరిగింది. అయితే అనుకున్న స్దాయిలో ప్రమోషన్స్ జరగటం లేదని ఫ్యాన్స్ నుంచి కంప్లైట్స్ వినిపిస్తున్నాయి. ఓ ప్రక్క ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో దూసుకుపోతోంది.వరస పెట్టి పెద్ద పెద్ద సిటీల్లో ప్రమోషన్స్ చేస్తోంది. కానీ పుష్ప కూడా ప్యాన్ ఇండియా సినిమా అయినా ఆ పట్టింపు కనపడటం లేదు. ఎక్కడుంది లోపం...ఏమిటి బన్ని స్ట్రాటజీ ?

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు బన్నికి సినిమాపై పూర్తి స్దాయిలో కాన్ఫిడెన్స్ ఉందిట. కేవలం మౌత్ టాక్ తోటే కలెక్షన్స్ భారీగా వస్తాయని భావిస్తున్నారట. కంటెంట్ బలంగా ఉన్నప్పుడు ఓ కేజీఎఫ్ సినిమాలాగ దానంతట అదే జనాల ఎటెన్షన్ ని గ్రాబ్ చేస్తుందని నమ్మి ముందుకు వెళ్తున్నారట. అందుకే బన్నీ కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న మలయాళంలో కూడా పుష్పని ఎక్కువగా ప్రమోట్ చేయడం లేదు. గీతా ఆర్ట్స్ సైతం ఈ సారి పుష్ప సినిమా ప్రమోషన్ విషయంలో సైలెంట్ గా ఉన్నారట. సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేయటమే బన్ని స్ట్రాటజీ అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ కు అదే విషయం బన్ని చెప్పి ఒప్పించారట. తన సినిమాలకు మిగతా చిత్రాల స్దాయిలో ప్రమోట్ చెయ్యాల్సిన  పనిలేదని ఇండైరక్ట్ గా చెప్పబోతున్నారంటున్నారు. బన్ని స్ట్రాటజీ కనుక వర్కవుట్ అయితే పెద్ద సినిమాల ప్రమోషన్స్ ఓ పెట్టుబడి లేని దారి దొరికినట్లే. 

Latest Videos

undefined

మరో ప్రక్క పుష్ప ని సరిగ్గా ప్రమోట్ చేయడం లేదనే అభిప్రాయాన్ని దర్శకుడు రాజమౌళి కూడా ఇన్ డైరెక్ట్ గా నిన్న ప్రి రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. ”బన్నీ ఇది చాలా గొప్ప సినిమా. ముంబాయ్ లో పుష్ప గురించి అడుగుతున్నారు. నీవు అక్కడ కూడా దిన్ని ప్రమోట్ చేయాలి” అని చెప్పారు రాజమౌళి. పుష్ప కి పాన్ ఇండియా ప్రమోషన్ అవసరం అనే సంగతి రాజమౌళి గుర్తించారంటే .. పాన్ ఇండియా ప్రమోషన్ లో పుష్ప ఎంత స్లో గా వుందో అర్ధం చేసుకోవచ్చు.  

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘అందరికీ ఫ్యాన్స్‌ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంది. అభిమానులు నా ఆర్మీ. నేను నా జీవితంలో సంపాదించుకుంది ఏదైనా ఉంటే అభిమానులే. మీకన్నా ఏదీ ఎక్కువ కాదు. దేవిశ్రీ ప్రసాద్‌తో ఎప్పటినుంచో జర్నీ కొనసాగుతోంది. ఈ సినిమా కోసం అద్భుతమైన పాటలు ఇచ్చాడు. నువ్వు, నేను, సుక్కుగారు కలిసి జర్నీ మొదలు పెట్టాం. సినిమాటోగ్రాఫర్‌ కూబా, ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, మౌనిక ఈసినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ ఒక్క సినిమా నాలుగు సినిమాల కష్టం. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

Also read Allu Arjun: రామ్ చరణ్, మహేష్ చేసిన తప్పే చేస్తున్న అల్లు అర్జున్... మరీ ఇంత అలసత్వమా!

 రష్మికను ముద్దుగా క్రష్మిక అనిపిలుస్తా. మనం చాలా మందితో కలిసి పనిచేస్తాం. కొందరే మన మనసుకు నచ్చుతారు. అలాంటి వ్యక్తి రష్మిక. చాలా టాలెంట్‌ గర్ల్‌. చాలా చక్కని ఆర్టిస్ట్‌. సమంత ఐటమ్‌ సాంగ్‌ చేశారు. ఆమెకు ధన్యవాదాలు. సునీల్‌ను ఇప్పటివరకూ ఒక రకంగా చూశాం. మంగళం శీనుగా కొత్త సునీల్‌ను చూస్తారు. కొండారెడ్డిగా అజయ్‌ ఘోష్‌, దాక్షాయణిగా అనసూయ, ఎంపీ పాత్రలో రావు రమేశ్‌, కన్నట నటుడు ధనుంజయ చాలా చక్కగా నటించారు. భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా ఫహద్‌ ఫాజిల్‌ నటన వేరే లెవల్‌. ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ’’అని అల్లు అర్జున్‌ అన్నారు.

Also read Allu arjun: ఫ్యాన్స్ మీట్‌లో పలువురికి గాయాలు.. బన్నీ క్షమాపణలు..
 

click me!