
ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరో పది రోజుల్లో రిలీజ్ కు ఉన్నా రేపే రిలీజ్ అన్నంత హడావిడి కనపడుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో, సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెత్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు చెప్పబడుతున్న ఈ సినిమా రైట్స్ భారీగానే అమ్మారు. ఈ క్రమంలో రికవరీలు ఏ మేరకు ఉంటాయనేది ట్రేడ్ లో పెద్ద చర్చగా మారింది..
ఈ చిత్రం తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూ.185 కోట్లకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.155 కోట్ల బిజినెస్ జరిగింది. నైజాంలో రూ.60 కోట్లు, ఆంధ్ర - రూ. 70 కోట్లు, సీడెడ్ - రూ.25 కోట్లు కాగా.. మిగిలిన తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూ.30 కోట్ల మేరకు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుంది. వారు ఇప్పుడు రికవరీ పై దృష్టి పెట్టారు. అందులో భాగంగా షోలు ప్లానింగ్ జరుగుతోంది.
ఇక ఈ చిత్రంకి వారు తెల్లవారు జాము షోస్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. దాదాపు అయితే తెల్లవారు జాము 4 గంటలకే షోస్ పడే ఛాన్స్ ఉందని అలాగే 1 గంట కి కూడా పరిశీలనలో ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా అయితే 4 గంటల షో కి అయితే దాదాపు ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
మంగళవారం (జూన్ 6) రోజున ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలోని తారకరామ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందుకు భారీ ఏర్పాటు సైతం రెడీ చేసేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ అండ్ టీమ్ తిరుమల చేరుకుంది. చిన జీయర్ స్వామి ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ మూవీ నుంచి మరో ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు.