స్టార్స్ తో భోజనం చేద్దామనుకున్నా.. కాలర్ పట్టుకుని గెంటేశారు, నవాజుద్దీన్ సిద్దిఖీ సంచలన వ్యాఖ్యలు

Published : Jun 06, 2023, 11:29 AM IST
స్టార్స్ తో భోజనం చేద్దామనుకున్నా.. కాలర్ పట్టుకుని గెంటేశారు, నవాజుద్దీన్ సిద్దిఖీ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఎంత పెద్ద స్టార్ అయినా కెరీర్ లో ఎదో ఒక సందర్భంలో అవమానాలు ఎదుర్కోక తప్పదు. అవి వారికి జీవితాంతం గుర్తుండిపోయాతాయి.. వాళ్లు స్టార్లుగామారిన తరువాత ఆ అవమానాలు గుర్తు చేసుకుంటుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ కూడా తన కెరీర్ లో జరిగిన అవమానాలు గురించి తాజాగా వెల్లడించారు. 

బాలీవుడ్ లో చిన్న పాత్రల దగ్గర నుంచి స్టార్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. హిందీ పరిశ్రమలోనటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా బాలీవుడ్ లో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక త్వరలో వెంకటేష్ సైంధవ్ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. అంతే కాదు ఈమధ్య తన భార్యతో గొడవల విషయంలో హైలెట్ అవుతున్నారు నవాజ్. భార్య ఆరోపణలు.. నవాజ్ ప్రత్యారోపణలతో బాలీవుడ్ లో సరికొత్త సీన్ ను ఆవిష్కరించారు. 

ఇక ఇప్పుడిప్పుడు గొడవలకు పుల్ స్టాప్ పడగా.. తాజాగా నవాజ్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ  ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ సిద్దీఖీ తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతే కాదు సంచలన నిజాలు వెల్లడించారు. అంత స్టార్ జీవితంలో ఇంత విషాదం ఉందా అని అనిపించేలా.. తన కెరీర్ గురించి వివరిచారు. ఇక వాజుద్దీన్‌ సిద్దిఖీ మాట్లాడుతూ.. కెరీర్ మొదట్లో, స్టార్ యాక్టర్ అవ్వకముందు సినీ పరిశ్రమలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను అని అన్నారు. . సెట్ లో ఎవరూ పట్టించుకునేవారు కాదు అంటున్నాడు నవాజ్. 

అంతే కాదు కనీసం  ప్రొడక్షన్ బాయ్  మంచినీళ్లు అడిగినా ఇచ్చేవాళ్లు కాదు. సెట్స్ లో అందరూ కలిసి భోజనాలు చేయరు. స్టార్స్ కి ఒకచోట, జూనియర్ ఆర్టిస్టులకి ఒకచోట భోజనం పెట్టేవారు. ఓ సారి స్టార్స్ తో కలిసి భోజనం చేయాలనిపించింది. స్టార్స్ తినే దగ్గరకి వెళ్లి తినడానికి కూర్చున్నాను. భోజనం పెడతారు అనుకునే లోపే కొంతమంది సిబ్బంది వచ్చి నా కాలర్ పట్టుకొని బయటకు లాగేశారు. ఆ రోజు చాలా బాధపడ్డాను అని తెలిపారు. 

నవాజుద్డీన్ లా చాలా మంది స్టార్స్ ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసి.. స్టార్స్ గా మారినవాళ్లే. ఈక్రమంలో దీంతో బాలీవుడ్ లో నవాజుద్దీన్‌ సిద్దిఖీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.  చాలా మంది ఆయన శాడ్ స్టోరీ తెలుసుకుని రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?