'పుష్ప-2' ఆర్టిస్టులు బస్సుకు యాక్సిడెంట్.. పలువురికి గాయాలు

By Surya Prakash  |  First Published May 31, 2023, 12:57 PM IST

 బస్సు రోడ్డు ప్రమాదానికి గురయింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే రహదారిలో నార్కట్ పల్లి వద్ద ఆర్టిస్టులు వస్తున్న బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. 


అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప-2' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  పుష్ప 2 షూటింగ్ ప్రస్తుతం ఏపీలోని అల్లూరి జిల్లాలో ఉన్న మారేడుమిల్లి ఫారెస్ట్ లో, ఆ దగ్గర్లో ఉన్న మోతుగూడెం గ్రామంలో జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ యూనిట్ తో పాటు తండా జనాలు కూడా తెగ హడావిడి చేస్తున్నారు. సుకుమార్ అండ్ టీమ్ తో పాటు మెయిన్ టెక్నికల్ టీమ్ మొత్తం అక్కడే ఉన్నారు.  మారేడుమిల్లీ అడవుల్లో కొన్ని కీలకమై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు. 

తాజాగా ఈ సినిమా ఆర్టిస్టులు షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ వస్తూండగా వారు వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురయింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే రహదారిలో నార్కట్ పల్లి వద్ద ఆర్టిస్టులు వస్తున్న బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. షూటింగ్ ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం.  

Latest Videos

ఇక ఫస్ట్ పార్ట్ లాగానే రెండో భాగాన్ని కూడా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూట్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకూ ఈ షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో చేశారు. అది ఓ మైనర్ షెడ్యూర్. అక్కడ బ్లూ మ్యాట్, గ్రీన్ మ్యాట్ తో కవర్ చేస్తూ గ్రాఫిక్స్ లో అడవిని క్రియేట్ చేసారని సమాచారం. అందుకు ప్రధాన కారణం.. ప్రస్తుతం వేసవి కావడమే. 

కానీ అనుకున్న ఎఫెక్ట్ సహజంగా రాలేదని వినికిడి. దాంతో  పుష్ప కోసం దట్టమైన అడవిని కొంత క్రియేట్ చేసినా ...సరిగ్గా వర్కవుట్ కావాలంటే అడవిలోకి వెళ్లాల్సిందే అని ఫిక్సయ్యారు. ఈ వేసవిలో ఎలాంటి అడవి అయినా.. డ్రై గా కనిపిస్తుంది. ఆకులన్నీ రాలిపోయి.. చెట్లన్నీ మోడువారినట్టుగా ఉంటాయి. అయితే అదృష్టం టీమ్ తో పాటే ఉంది. సరిగ్గా ఈ  మండు వేసవిలో విపరీతమైన వర్షాలు మారేడుమిల్లి అడవుల్లో  కురుస్తున్నాయి. దీంతో అడవి అంతా  పచ్చబడింది.  దాంతో  ఇంత ఎండల్లోనూ అడవి మొత్తం కనులు విందుగా  కనిపిస్తుండటంతో షూటింగ్ కు మారేడుమిల్లికి షిఫ్ట్ చేశారు.

వీటిలో ముఖ్యంగా ఫహాద్ ఫాజిల్ ఉన్న సీన్స్ ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఎంట్రీ ఇచ్చారు. రష్మిక, అల్లు అర్జున్ మధ్య కొన్ని సీన్స్ తీయబోతున్నట్లు సమాచారం.  కథ మాత్రం  శేషాచలం అడవుల్లో జరుగుతుంది. అయితే ఈ మారేడిమిల్లి అడవులే..శేషాచలం గా కనిపిస్తాయన్నమాట. 

మొదటి భాగానికి మించి రెండో భాగం ఉండనుంది. ఇందులో పుష్ప మీద రివెంజ్ కోసం భన్వర్ సింగ్ శెకావత్ ఎంత క్రూరంగా మారాడు అనేది చూపించనున్నాడు. ఇక తాజా షెడ్యూల్లో ఫహాద్ ఫాజిల్ తన పార్టును పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో ఫహద్, సుకుమార్ సీన్ అయ్యాక మానిటర్ లో చూస్తున్నట్లు కనిపించారు. ” పుష్పరాజ్ ను వేటాడేందుకు భన్వర్ సింగ్ శెకావత్ వర్క్ చేస్తున్నాడు. పుష్ప 2లో ఫహాద్ కీలక పార్టును పూర్తి చేసుకున్నారు. ఈ సారి పుష్ప – శెకావత్ మధ్య వార్ ను చూసేందుకు వేచి చూడలేకపోతున్నాం” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. 

click me!