జబర్దస్త్ లో రోజా మార్క్ పాలిటిక్స్.. నాగబాబు ప్లేస్ ఆయనదే ?

Published : Jan 01, 2020, 02:55 PM IST
జబర్దస్త్ లో రోజా మార్క్ పాలిటిక్స్.. నాగబాబు ప్లేస్ ఆయనదే ?

సారాంశం

మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షో నుంచి తప్పుకోవడం చిత్ర పరిశ్రమతో పాటు అభిమానుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి రోజా, నాగబాబు ఆ షోకు జడ్జిలుగా ఒదిగిపోయారు. తెలుగులో అత్యధిక టిఆర్సీ రేటింగ్స్ సాధించే షోలలో జబర్దస్త్ ఒకటి. 

మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షో నుంచి తప్పుకోవడం చిత్ర పరిశ్రమతో పాటు అభిమానుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి రోజా, నాగబాబు ఆ షోకు జడ్జిలుగా ఒదిగిపోయారు. తెలుగులో అత్యధిక టిఐఆర్సీ రేటింగ్స్ సాధించే షోలలో జబర్దస్త్ ఒకటి. 

నాగబాబు తప్పుకోవడంతో ఆ షోకు ఎంతోకొంత మైనస్ అనే చెప్పాలి. నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి ప్రముఖ ఛానల్ జీతెలుగులో ప్రసారమయ్యే అదిరింది అనే షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. దీనితో జబర్దస్త్ టీం నాగబాబు స్థానాన్ని భర్తీ చేసే సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నారు. 

నాగబాబు జబర్దస్త్ కు దూరమయ్యాక కమెడియన్ అలీ కొన్ని రోజులు జడ్జిగా వ్యవహరించాడు. ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వీళ్లంతా తాత్కాలికంగానే జడ్జిగా మారినట్లు తెలుస్తోంది.  అయితే జబర్దస్త్ టీమ్ మాత్రం పర్మనెంట్ జడ్జికోసం వెతుకుతున్నారు. 

విజయశాంతి మూడు సార్లు రిజెక్ట్ చేశారు.. ఆ మూవీ రివీల్ చేసిన అనిల్ రావిపూడి!

అయితే రోజా ఇక్కడ తన పలుకుబడి ఉపయోగించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. పోసానితో రోజాకు మంచి సాన్నిహిత్యమే ఉంది. అలాగే పోసాని వైసిపి మద్దతుదారుడు. దీనితో పోసానిని పర్మనెంట్ జడ్జిగా నియమించాలని జబర్దస్త్ యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. 

పాయల్ రాజ్ పుత్ అందాల హొయలు.. వైరల్ అవుతున్న ఫొటోస్!

పోసాని కూడా హాస్యాన్ని ఇష్టపడే వ్యక్తి. దీనితో ఆయనే జబర్దస్త్ కు పర్మనెంట్ జడ్జిగా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో జబర్దస్త్ జడ్జిగా సీనియర్ నటుడు నరేష్ పేరు కూడా వినిపించింది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?