'అల.. వైకుంఠపురములో' ఈవెంట్.. నిర్వాహకులపై క్రిమినల్ కేసు

By Prashanth MFirst Published Jan 9, 2020, 10:27 AM IST
Highlights

'అల.. వైకుంఠపురములో' సినిమా ఈ నెల 12న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందే ఊహించని విధంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పడం లేదు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పై పోలీస్ కేసు నమోదవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

అల్లు అర్జున్ న్యూ మూవీ 'అల.. వైకుంఠపురములో' సినిమా ఈ నెల 12న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందే ఊహించని విధంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పడం లేదు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పై పోలీస్ కేసు నమోదవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 6న 'అల.. వైకుంఠపురములో' చిత్ర యూనిట్ మ్యూజిక్ కన్సర్ట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.

అయితే తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా చిత్ర వ్యవహరించిన తీరుకు చిత్ర నిర్మాణ సంస్థలపై అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు వివరాల్లోకి వెళితే.. ఈ నెల 2న హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ మేనేజర్‌ కె.యగ్నేష్‌ ఈవెంట్ నిర్వహణ కోసం అనుమతులు తీసుకున్నారు. ఈ నెల 6న సాయంత్రం యూసుఫ్‌ గూడ బెటాలియన్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌ లో ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. అసలైతే.. సినిమా ఈవెంట్ తీసుకున్న అనుమతి ప్రకారం రాత్రి 10గంటలకే ముగియాలి.

కానీ 11:30గంటల వరకు కొనసాగించారు. అలాగే ఆరువేల మందికి పాస్ లు ఇచ్చినట్లు చెప్పిన నిర్వాహకులు 15వేల మందికి పాస్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందువల్ల యూసుఫ్ గూడా పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈవెంట్ లో తొక్కిసలాట కూడా జరిగింది.  దీంతో నిర్వాహుకులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.  హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ మేనేజర్‌ యగ్నేష్‌ పై  అలాగే శ్రేయాస్‌ మీడియా ఎండీ శ్రీనివాస్‌తో పై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

'దర్బార్' ప్రీమియర్ షో టాక్

click me!