జానీ చిత్రానికి పవన్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా!

Published : Dec 05, 2019, 07:07 PM IST
జానీ చిత్రానికి పవన్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా!

సారాంశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో పవన్ ఒకరు. అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ వెండితెరపై కనిపించలేదు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో పవన్ ఒకరు. అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ వెండితెరపై కనిపించలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పరాజయం చెందింది. 

ప్రస్తుతం పవన్ తన పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం పవన్ రాయలసీమ పర్యటనలో ఉన్నాడు. తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చే క్రమంలో రెమ్యునరేషన్ గురించి పవన్ మాట్లాడాడు. రాజకీయాల్లో డబ్బు సంపాదించాల్సిన అవసరం తనకు లేదని పవన్ అన్నాడు. 

ప్రియుడితో సహజీవనం.. చంపాలని చూస్తున్నాడు.. నటి వీడియో వైరల్

'జానీ' చిత్రానికే తాను రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు పవన్ ప్రకటించాడు. ఆ డబ్బుతో అప్పట్లో మాదాపూర్ లో 30 ఎకరాలు కొనుగోలు చేసి ఉంటే ప్రస్తుతం తనకు వేలకోట్ల ఆస్తులు  ఉండేవి అని పవన్ అన్నాడు. అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిన జానీ చిత్రం పవన్ స్వీయ దర్శత్వంలో తెరకెక్కింది.  

రోజా గెలుపునకు కారణం చెప్పిన నాగబాబు.. సుధీర్, ఆదిని తీసేద్దాం అనుకుంటే..

అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో పవన్ సినీ కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఖుషి చిత్రంతో పవన్ టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా మారిపోయాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించబోతున్నాడు అని, బాలీవుడ్ లో విజయం సాధించిన పింక్ రీమేక్ లో లాయర్ పాత్రలో నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ పవన్ మాత్రం పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?