లుక్ టెస్ట్ కంప్లీట్.. మొఘల్ సామ్రాజ్యంలో పవన్.. ఉత్కంఠ రేపేలా క్రిష్ చిత్రం!

Published : Jan 20, 2020, 04:24 PM IST
లుక్ టెస్ట్ కంప్లీట్.. మొఘల్ సామ్రాజ్యంలో పవన్.. ఉత్కంఠ రేపేలా క్రిష్ చిత్రం!

సారాంశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్నారు. రాజకీయాలు కొనసాగిస్తూనే సినిమాలు కూడా చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో అనేక ఆసక్తికరమైన చిత్రాలకు పవన్ ఓకే చెబుతున్నాడు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్నారు. రాజకీయాలు కొనసాగిస్తూనే సినిమాలు కూడా చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో అనేక ఆసక్తికరమైన చిత్రాలకు పవన్ ఓకే చెబుతున్నాడు. ముందుగా దిల్ రాజుకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం పవన్ పింక్ రీమేక్ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. 

సోమవారం రోజు పింక్ రీమేక్ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. వేణు శ్రీరామ్ దర్శత్వంలో తెరక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ 27వ చిత్రం గురించి కూడా ఆసక్తికర ఉహాగానాలు వెలువడుతున్నాయి. తాజాగా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం పవన్ కళ్యాణ్ లుక్ టెస్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది. 

నిజమైన కలెక్షన్స్ మాత్రమే చెబుతాం.. గెలిచాం, కొట్టాం.. తమన్ కామెంట్స్!

పింక్ చిత్రం పూర్తి కాకముందే క్రిష్ చిత్రాన్ని కూడా ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. ఏఎం రత్నం ఈ చిత్రానికి నిర్మాత. హీరోయిన్ గా పూజా హెగ్డే నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రం కోసం మొఘల్ సామ్రాజ్యంనేపథ్యంలో.. ఔరంగజేబు కాలానికి సంబందించిన పీరియాడిక్ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

'పింక్' రీమేక్.. పవన్ అదే లుక్కా..?

ఈ చిత్రంలో పవన్ వైవిధ్యభరితమైన పాత్రలో కనిపిస్తాడట. అందుకోసం పవన్ కి లుక్ టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?