
కొత్త దర్శకులు తమ టాలెంట్ ని ప్రదర్శిస్తూ, కొత్త కాన్సెప్ట్ లతో ముందుకు వస్తున్నారు. టీజర్ తోనే ఆసక్తి క్రియేట్ చేస్తున్నారు. అలాంటివారికి స్టార్ హీరోలు, దర్శకులు తమదైన సాయిం అందిస్తున్నారు. తాజాగా అలాంటి మరో టీజర్ విడుదలైంది. ఆ టీజర్ ని విడుదల చేసింది మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్. త్రివిక్రమ్ ఇంతకు ముందు ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ని విడుదల చేస్తే మహేష్ సినిమా టీజర్‌ను శుక్రవారం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఓ పాపకు తండ్రి కథ చెప్పాలనుకుంటే.. ఆ పాపే తండ్రి కథ చెప్పడంతో టీజర్ స్టార్ట్ ప్రారంభం అయ్యింది.
ఆ టీజర్ ఇలా సాగుతుంది ..ఓ అందమైన పల్లెటూరు. అక్కడ అందమైన వెంకట లక్ష్మి ఉండేది. అదే ఊళ్లో ఉంటున్న ప్రభుకి వెంకట లక్ష్మి అంటే చిన్నప్పట్నుంచి చాలా ఇష్టం. అదే సమయంలో వెంకటలక్ష్మి వాళ్లింటికి క్రిష్ అనే మరో యువకుడు వస్తాడు. అతను కూడా వెంకట లక్ష్మిని ఇష్టపడతాడు. అదే సమయంలో కథలో అనుకోని మలుపు తిరుగుతుంది. వెంకటలక్ష్మిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మరి ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు? అని తెలుసుకోవాలంటే మార్చి 6న విడుదలైయ్యే సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాతలు. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి హీరో హీరోయిన్లుగా చెందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనందప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఓ పిట్టకథ’.
నిర్మాత వి.ఆనందప్రసాద్ మాట్లాడుతూ ‘‘చెందు ముద్దు చెప్పిన 'ఓ పిట్ట కథ' చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించి, వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లాం. సినిమా చాలా బాగా వచ్చిందిస’’ అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి మాట్లాడుతూ ‘‘ఓ వైపు కామెడీ, మరోవైపు థ్రిల్లింగ్‌అంశాలతో, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుంది . చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు.
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ''ఒక విలేజ్‌లో జరిగే స్టోరీ ఇది. ప్రతి సన్నివేశం స్వచ్ఛంగా సాగుతుంది. ఓ వైపు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. మరోవైపు ఏంజరుగుతోందనే ఉత్కంఠను రేకెత్తిస్తుంది . పతాక సన్నివేశాల వరకూ ఆ థ్రిల్లింగ్ అలాగే సస్టైన్ అవుతుంది. ట్విస్టులు మరింత థ్రిల్ కలిగిస్తుంటాయి. స్క్రీన్ ప్లే ప్రధానంగా తెరకెక్కించాం’’ అన్నారు.