సూపర్ హిట్ సీక్వెల్ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ?

Published : May 01, 2020, 05:02 PM IST
సూపర్ హిట్ సీక్వెల్ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ?

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోరాట యోధుడు కొమరం భీంగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోరాట యోధుడు కొమరం భీంగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ వరుస చిత్రాలతో బిజీ కానున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శత్వంలో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఎన్టీఆర్ అభిమానులని సంతోషంలో ముంచెత్తే మరో వార్త వైరల్ అవుతోంది. ప్రతిభగల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శత్వంలో నటించేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడట. గతంలో ఎన్టీఆర్, వంశీ కాంబోలో బృందావనం లాంటి సూపర్ హిట్ తెరకెక్కింది. 

అమెరికాలో ట్రంపే పెద్ద దేశ ద్రోహి.. చంద్రుడిపైకి మనిషిని పంపారు.. కానీ

బృందావనం చిత్రానికి సీక్వల్ గా వంశీ పైడిపల్లి మరో స్టోరీలైన్ ఎన్టీఆర్ కు వినిపించాడట. ఎన్టీఆర్ కు ఆ లైన్ నచ్చడంతో వెంటనే పూర్తి కథ సిద్ధం చేయమని వంశీని కోరినట్లు తెలుస్తోంది. బృందావనం చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువతని బాగా మెప్పించింది. 

ఇదిలా ఉండగా వంశీ పైడిపల్లి రాంచరణ్ తో కూడా ఓ చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడని.. సూపర్ స్టార్ మహేష్ ఆ చిత్రానికి నిర్మాత అని ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?