తండ్రి బెల్ట్‌తో కొడుకును కొట్టిన చిరంజీవి.. ఎందుకంటే?

Published : May 01, 2020, 03:45 PM ISTUpdated : May 01, 2020, 03:58 PM IST
తండ్రి బెల్ట్‌తో కొడుకును కొట్టిన చిరంజీవి.. ఎందుకంటే?

సారాంశం

చరణ్ సాధించిన విజయాలతో చిరంజీవి ఉప్పొంగిపోవటం చూస్తే చరణ్‌ అంటే చిరుకు ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతుంది. అయితే ఇంత ప్రేమగా ఉండే చిరు ఒక సందర్భంలో రామ్‌ చరణ్‌ను బెల్ట్ తీసుకొని కొట్టాడట. ఈ విషయాన్ని స్వయం రామ్ చరణ్ వెల్లడించాడు.

మెగాస్టార్ వారసుడిగా మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ వెండితెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. చిరు, చరణ్ లు ఎప్పుడు కలిసి కనిపించినా ఫ్రెండ్స్‌ సరదాగా ఉంటారు. అంతేకాదు చరణ్ సాధించిన విజయాలతో చిరంజీవి ఉప్పొంగిపోవటం చూస్తే చరణ్‌ అంటే చిరుకు ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతుంది. అయితే ఇంత ప్రేమగా ఉండే చిరు ఒక సందర్భంలో రామ్‌ చరణ్‌ను బెల్ట్ తీసుకొని కొట్టాడట. ఈ విషయాన్ని స్వయం రామ్ చరణ్ వెల్లడించాడు.

చరణ్ ఎనిమిదేళ్ల వయసులో తన ఇంటి వాచ్‌ మెన్‌ సెక్యూరిటీ వ్యక్తి మాట్లాడుకోవటం విన్నాడట. అయితే ఆ మాటలకు అర్ధం తెలియక వెళ్లి బాబాయ్‌ నాగబాబును అడిగాడట. అదే సమయంలో చిరంజీవి షూటింగ్‌ ముగించుకొని ఇంటికి రావటంతో చిరును రూంలకి తీసుకెళ్లిన నాగబాబు, చరణ్ చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడని చెప్పాడట.

దీంతో కోపంతో ఊగిపోయిన చిరంజీవి, తన తండ్రి బహుమతిగా ఇచ్చిన బెల్డ్‌తో చరణ్‌ను కొట్టాడట. తరువాత చెర్రీని దగ్గరకు తీసుకొని అవి చెడ్డ మాటలని అలాంటివి ఎప్పుడు మాట్లాడ వద్దని చెప్పాడు. ఈ సంఘటన తరువాత జీవితం ఇంకెప్పుడు చిరు చరణ్ మీద చేయి చేసుకోలేదట. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా చరణ్‌, చిరులు ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న చిరు అభిమానులకు కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?