నాని ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ ఎంత

By Surya Prakash  |  First Published Aug 28, 2024, 10:20 AM IST

‘సరిపోదా శనివారం’ (Saripodhaa sanivaaram) చూస్తున్నంత సేపూ ప్రేక్షకుడిలో ఇంటెన్స్ తో నడుస్తుందని నాని (Nani) అంటున్నారు.  


నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సరిపోదా శనివారం’.  ఆగస్ట్ 29న  విడుదల కానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎంత బిజినెస్ అయ్యింది. ఎంత అయితే బ్రేక్ ఈవెన్ అవుతుంది వంటి విషయాలు చూద్దాం.

వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు… 

Latest Videos

👉నైజాం: 12.50Cr(Valued)
👉సీడెడ్: 5Cr
👉ఆంధ్రా: 12.5CR
ఆంధ్రా, తెలంగాణా లెక్కలు:- 30CR
👉కర్ణాటక+రెస్టాప్ ఆఫ్ ఇండియా: 5Cr
👉OS – 6Cr
మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 41CR(బ్రేక్ ఈవెన్ – 42CR~)

సినిమా మీద ఉన్న అంచనాలకు ఇంకా ఎక్కువ బిజినెస్ కి అవకాసం ఉన్నా సేఫ్ సైడ్ బిజినెస్ చేశారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 42 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి జోరుని సినిమా చూపిస్తుందో చూడాలి.
 
‘సరిపోదా శనివారం’ (Saripodhaa sanivaaram) చూస్తున్నంత సేపూ ప్రేక్షకుడిలో ఇంటెన్స్ తో నడుస్తుందని నాని (Nani) అంటున్నారు.  

నాని మాట్లాడుతూ..‘‘సినిమాపై ఎంత దృష్టి పెట్టామో, ప్రమోషన్స్‌పైనా అంతే దృష్టి పెట్టాలని అర్థమైంది. సాధారణంగా సినిమాలో కంటెంట్‌ ఉంటే, అదే చూసుకుంటుందన్న ఫీలింగ్‌ ఉండేది. రోజూ సినిమాలను ఫాలో అయ్యేవారికి కొత్త చిత్రాల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుస్తూ ఉంటాయి. అలా కాకుండా పనుల్లో బిజీగా ఉన్నవారి దగ్గరకి మన సినిమాను తీసుకెళ్లాలి. అందుకు కచ్చితంగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయాల్సిందే. సాధారణ ప్రేక్షకులు సినిమాను చూడాలనే ఆలోచన కలిగించడం అన్నింటికన్నా పెద్ద పని’’ అన్నారు.
 
అలాగే ...‘‘ట్రైలర్‌లో ఏదైతే చూపించామో నాకు నచ్చిన పాయింట్‌. దాన్ని సినిమాగా మలిస్తే ఎలా ఉంటుందనే మీరు తెరపై చూడాలి. ఈ కథ చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. సాధారణంగా సినిమాలన్నింటిలో తెలియని ఒక బరువుని మోస్తుంటాను. అది ఈసారి ఎస్‌జే సూర్య గారిమీద, వివేక్ మీద ఉంది. నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నాను’’ అన్నారు.
 
ఇక  ‘‘దసరా’ తర్వాత ఈ మూవీని కూడా ఇతర రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. వేరే భాషల ప్రేక్షకుల నుంచి అంత ప్రేమని నేను ఊహించలేదు. సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తోంది. సినిమా సినిమాకీ ఆదరణ పెరుగుతోంది. ఇది బాధ్యతను మరింత పెంచుతోంది’’ అన్నారు.

click me!