వైష్ణవ్ తేజ నెక్ట్స్ ప్రాజెక్టు విశ్వక్సేన్ డైరక్టర్ తో నే ?

By Surya Prakash  |  First Published Aug 27, 2024, 10:18 AM IST

ఇలాంటి కథలతో వైష్ణవ్ తేజ్ ఎలా కెరీర్ ను కొనసాగించాలనుకుంటున్నాడనేది ఆశ్చర్యపోయారు అభిమానులు. ఈ క్రమంలో ఓ కొత్త చిత్రం ఓకే చేసారు వైష్ణవ్ తేజ అని తెలిసింది. 


 సాయి ధరమ్ తేజ్ తమ్ముడుగా లాంచ్ అయిన  వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో మంచి పేరే తెచ్చుకున్నాడు. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 'ఉప్పెన' 100 కోట్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో  మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అయితే ఆ తర్వాత అతను నటించిన సినిమాలు ఏమీ కూడా హిట్ కాదు కదా, యావరేజ్‌గా కూడా కాలేదు. వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోయాయి. ఈ నేపధ్యంలో సరైన సాలిడ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. 

వాస్తవానికి వైష్ణవ్ తేజ నటనకు ఎవరూ వంకపెట్టడం లేదు. అతని జడ్జిమెంటే సమస్యగా మారిందంటున్నారు. ఉప్పెన తర్వాత అతడు చేసిన  కొండపొలం సినిమా థియేట్రికల్ గా ఆడలేదు. నవలను సినిమాగా సరిగ్గా ఎడాప్ట్ చేయలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన రంగరంగ వైభవంగా ఫ్లాప్ అయింది. అది రొటీన్ కథ అని తేల్చేసారు. ఇక యాక్షన్ ఫిల్మ్ అంటూ చేసిన  ఆదికేశవ  డిజాస్టర్ అని మార్నింగ్ షోకే తేలిపోయింది. ఇలాంటి కథలతో వైష్ణవ్ తేజ్ ఎలా కెరీర్ ను కొనసాగించాలనుకుంటున్నాడనేది ఆశ్చర్యపోయారు అభిమానులు. ఈ క్రమంలో ఓ కొత్త చిత్రం ఓకే చేసారు వైష్ణవ్ తేజ అని తెలిసింది. 

Latest Videos

ఆ దర్శకుడు మరెవరో కాదు రీసెంట్ గా విశ్వక్సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం చేసిన కృష్ణ చైతన్య అని తెలుస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం సరిగ్గా ఆడలేదు. విశ్వక్సేన్ క్రేజ్ తో ఫస్ట్ వీకెండ్ ఓకే అనిపించుకున్నా తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడేవాళ్లే లేరు.  ఈ క్రమంలో తన దగ్గరున్న మరో యాక్షన్ కథను హీరో వైష్ణవ్ తేజ్ కి  వినిపించినట్లు తెలుస్తోంది. ఈ కథ ఆయనకు బాగా నచ్చడంతో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్ పనులను షురూ చేసినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాని నిర్మించనున్నారు. మీడియం బడ్జెట్ మూవీగా దీనిని తెరకెక్కించాలని భావిస్తున్నారటడ్డి. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

కెరీర్ ప్రారంభంలో హీరోలకు ఫ్లాపులు కామన్ అని సర్దిచెప్పుకోవటానికి అతనికి వెనక మెగా కుటుంబం అండ ఉంది . ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో నిలబడాలంటే కథ ఫెరఫెక్ట్ గా ఉండాలి. కథా బలం ఉన్న సినిమాలు అవసరం. బలగం ,  మసూద లాంటి కథలను వైవిధ్యంగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. వైష్ణవ్ తేజ్  మేలుకోవాలి అంటున్నారు, మూస ఆలోచనల నుంచి బయటకు రావాలి. తన బ్యాక్ గ్రౌండ్ ను తన బలంగా మలుచుకోవాలి ముందుకు వెళ్లాలంటున్నారు అభిమానులు. 
 

click me!