'ఎగ్‌ పఫ్‌' అంటూ వైసిపి కి కౌంటర్ ఇచ్చిన సాయిధరమ్ తేజ్

Published : Aug 27, 2024, 09:59 AM IST
 'ఎగ్‌ పఫ్‌' అంటూ వైసిపి కి కౌంటర్ ఇచ్చిన సాయిధరమ్ తేజ్

సారాంశం

మెడలు రుద్దే Safe Hands ఎక్కడ ...అన్నా క్యాంటీన్లలో ప్లేట్లు కడగొచ్చుగా Safe Handsతో అంటూ సాయి తేజ్ ని ట్యాగ్ చేస్తూ


 సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఘన విజయం అందుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, జనసేన వర్గాల్లో ఆనందం వెల్లివిరిసిన సంగతి తెలిసిందే.  అలాగే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీశాఖలను కేటాయించడంతో ఆ సంతోషం రెట్టింపైంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఏక్టివ్ గా ఉండటంతో ఆయనపై విమర్శలు చేసేందుకు కానూ సాయి తేజ్ ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి లాగుతున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఓ చిన్నపాటి వివాదం లాంటిది ఒకటి  సోషల్ మీడియా కామెంట్స్ చోటు చేసుకున్నాయి. 
 
తన మామయ్య , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు అభినందనలు తెలియజేస్తూ సాయి ‘ధరమ్ తేజ్’ ఎక్స్ వేదికగా స్పందించాడు. ఆంధ్రప్రదేశ్ వర్తమానం, భవిష్యత్ ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉందంటూ వ్యాఖ్యానించాడు. పవన్ కల్యాణ్ ‘బలమైన తుపాను’ సృష్టించారని కొనియాడాడు.

ఇప్పుడా ట్వీట్ ని గుర్తు చేస్తూ...   . ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని సాయి ధరంతేజ్ పై వైసీపీ కార్యకర్తలు నిలదీయటం మొదలెట్టారు.  ఈ క్రమంలో వైసిపి కి చెందిన డాక్టర్  ప్రదీప్ రెడ్డి చింత... సాయిధరమ్ తేజ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసారు.  గతంలో ఏపీలో జరుగుతున్న అన్యాయంపై... స్పందించిన సాయి ధరమ్ తేజ్...  అన్నా క్యాంటీన్ల పరిశుభ్రతపై ఎందుకు స్పందించడం లేదని అన్నారు. 

మెడలు రుద్దే Safe Hands ఎక్కడ ...అన్నా క్యాంటీన్లలో ప్లేట్లు కడగొచ్చుగా Safe Handsతో అంటూ సాయి తేజ్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసారు. దానికి రిప్లై ఇస్తూ సాయి తేజ.. మీరు ఎక్కడ ఉంటారు సార్ అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా.. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎగ్ పఫ్  కుంభకోణం జరిగిందని సాయి ధరంతేజ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ ఎగ్ పఫ్ లో మీరు ఎంత తిన్నారు ప్రదీప్ అంటూ సాయి ధరమ్ తేజ్ చురకలు అంటించారు. దాంతో  వైసిపి కార్యకర్తలు… ఎగ్ పప్స్ పై… ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేయటం మొదలెట్టారు.  

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తణుకు అన్న క్యాంటీన్లో అపరిశుభ్రమైన మురికి నీటిలో .. ప్లేట్లను కడుగుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో వైరల్ కాగానే వెంటనే వైసీపీ సోషల్ మీడియా కూడా అలర్ట్ అయింది. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు వైసిపి నేతలు. అయితే ఆ వీడియోలో నిజం లేదని ఖండనలు వస్తున్నాయి.

సినిమాల విషయానికి వస్తే...విరూపాక్ష, బ్రో వంటి బ్లాక్‌ బస్టర్‌ విజయాల తరువాత సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ (Sai Durgha Tej) నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం రీసెంట్ గా  ప్రారంభమైంది. రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని హనుమాన్ సినిమాను నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?