#Nani26: నాని కొత్త సినిమా టైటిల్ 'టక్ జగదీష్'!

Published : Dec 03, 2019, 10:45 AM ISTUpdated : Dec 03, 2019, 10:53 AM IST
#Nani26: నాని కొత్త సినిమా టైటిల్ 'టక్ జగదీష్'!

సారాంశం

ఇక ఈ  సినిమా జనవరిలో ప్రారంభం కానుంది.  ఈ మధ్యనే  సినిమాకు ఓపెనింగ్ చేద్దాం అనుకుని, నగర శివార్లలో జరిగిన అనుకోని దుర్ఘటనతో వాయిదా వేసారు. దాంతో అఫీషియల్ గా సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేసి, జనవరిలో పూజ, షూటింగ్ ఒకేసారి చేసేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం.  

ఓ సినిమా  సక్సెస్ అయితే .. ఆ చిత్ర దర్శకుడు, హీరో కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. గతంలో నాని హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘నిన్నుకోరి’. విభిన్నమైన  కథతో ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న ప్రేమకథ ఇది. అన్ని వర్గాల వారిని అలరించిన ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు. అదే 'టక్-జగదీష్'. ఈ విషయాన్ని నాని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 

గోఎయిర్ విమాన సిబ్బందిపై టీవీ నటి ఫైర్!

ఇక ఈ  సినిమా జనవరిలో ప్రారంభం కానుంది.  ఈ మధ్యనే  సినిమాకు ఓపెనింగ్ చేద్దాం అనుకుని, నగర శివార్లలో జరిగిన అనుకోని దుర్ఘటనతో వాయిదా వేసారు. దాంతో అఫీషియల్ గా సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేసి, జనవరిలో పూజ, షూటింగ్ ఒకేసారి చేసేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం.  అలాగే ఈ సినిమాలో ...నాని వాళ్లు మొత్తం ఆరుగురు అన్నదమ్ములు. వాళ్లల్లో మధ్యవాడికిగా కనిపించే నానికి సినిమాలో టక్ జగదీష్ అనేది నిక్ నేమ్ అని తెలుస్తోంది. టక్ చేయటం అనేది ఓ టైమ్ లో చాలా పెద్ద ఫ్యాషన్. అంటే ఈ సినిమా కథ కూడా ఎనభైల్లోనో, తొంబైల్లోనో జరగనుందన్నమాట. అందుకే టక్ జగదీష్ అనే టైటిల్ ఫిక్స్ చేసారట.  

 షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడిగా రీతూ వర్మ నటించనుంది. నాని కెరీర్‌ లో బెస్ట్ గా నిలిచిన  ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నాని, రీతూలు కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి నటిస్తూండటంతో ఇంట్రస్టింగ్ గా  మారింది. మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో  నటిస్తోంది. 

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `వి` సినిమాలో నటిస్తున్నాడు.
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?