20 ఏళ్ల "నీ కోసం".. హిట్టిచ్చిన యావరేజ్ సినిమా

By Prashanth MFirst Published Dec 3, 2019, 10:16 AM IST
Highlights

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 1990లోనే రవితేజ తెరగ్రేటం చేశాడు. కానీ శ్రీను వైట్లతో హీరోగా చేసిన మొదటి సినిమా నీ కోసం 1999లో వచ్చింది. నేటితో ఆ సినిమా వచ్చి కరెక్ట్ గా 20 ఏళ్లయ్యింది. యావరేజ్ గా నిలిచినప్పటికీ ఓ విధంగా రవితేజ శ్రీనువైట్ల జీవితాలకు హిట్టు సినిమా అనే చెప్పాలి.

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు రవితేజ. అయితే ఈ హీరో మొదటి సినిమా వెండితెరపైకి వచ్చి 29 ఏళ్లవుతోంది. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 1990లోనే రవితేజ తెరగ్రేటం చేశాడు. కానీ శ్రీను వైట్లతో హీరోగా చేసిన మొదటి సినిమా నీ కోసం 1999లో వచ్చింది. నేటితో ఆ సినిమా వచ్చి కరెక్ట్ గా 20 ఏళ్లయ్యింది.

యావరేజ్ గా నిలిచినప్పటికీ ఓ విధంగా రవితేజ శ్రీనువైట్ల జీవితాలకు హిట్టు సినిమా అనే చెప్పాలి.  కరెక్ట్ గా 1999 డిసెంబర్ 3న నీ కోసం సినిమా విడుదలయ్యింది. ఈ సందర్బంగా దర్శకుడు శ్రీను వైట్ల సినిమా గురించి సోషల్ ఇండియాలో ట్వీట్ చేశారు. నా మొదటి సినిమా వచ్చి 20 ఏళ్లయ్యింది. అప్పుడు ఇదే సమయానికి తిరుమలలో ఉన్నాను. ఆ సినిమా విషయంలో నాకు సహాయపడిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

నన్ను నమ్మిన రామోజీ రావుగారికి ప్రత్యేక కృతజ్ఞతలని శ్రీను వైట్ల ట్వీట్ చేశారు.  అయితే నీ కోసం సినిమా విడుదలైనప్పుడు అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది,. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చే సమయానికి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజే హిట్ గా నిలిచింది. అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకొని 5నంది అవార్డులను సొంతం చేసుకుంది.

! My first film completes 20years today .Was in Tirumala the same day thanking god ..now here I am thanking each and everyone who has been a part of this film and helped me prove myself . I will be ever grateful to Shri Ramoji Rao Garu for believing in me ..🙏🙏🙏 pic.twitter.com/1Y6toapwLu

— Sreenu Vaitla (@SreenuVaitla)

ఉత్తమ కథానాయిక - ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ - బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్, స్పెషల్ జ్యూరీ - బెస్ట్ ఫిల్మ్ క్యాటగిరీలలో ఈ సినిమాకు నంది అవార్డులు దక్కాయి. మొత్తానికి సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ శ్రీనువైట్లకి - రవితేజ కెరీర్లకు మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.

click me!