అవసరాలతో శౌర్య సినిమా ఆగిపోలేదట!

Published : Feb 27, 2020, 05:15 PM IST
అవసరాలతో శౌర్య సినిమా ఆగిపోలేదట!

సారాంశం

తనతో 'ఛలో' సినిమా తీసిన దర్శకుడు వెంకీ కుడుములపై ఆరోపణలు చేశాడు శౌర్య. మరోపక్క శౌర్య నటించిన 'అశ్వథ్థామ'లో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్ కౌర్.. శౌర్య సొంత నిర్మాణ సంస్థపై ఆరోపణలు చేయడం వంటివి మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 

కుర్ర హీరో నాగశౌర్య ఈ మధ్యకాలంలో తన సినిమాలతో కాకుండా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. తనతో 'ఛలో' సినిమా తీసిన దర్శకుడు వెంకీ కుడుములపై ఆరోపణలు చేశాడు శౌర్య. మరోపక్క శౌర్య నటించిన 'అశ్వథ్థామ'లో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్ కౌర్.. శౌర్య సొంత నిర్మాణ సంస్థపై ఆరోపణలు చేయడం వంటివి మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇది ఇలా ఉండగా .. శౌర్య తదుపరి సినిమా ఆగిపోయిందనే వార్త మరో చర్చకు తెరతీసింది. 'అశ్వథ్థామ' తరువాత అవసరాల శ్రీనివాస్ రూపొందిస్తోన్న సినిమాలో నాగశౌర్య నటిస్తున్నారు. అవసరాల రూపొందించిన 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి చిత్రాల్లో శౌర్య నటించిన సంగతి తెలిసిందే.

నితిన్ కోసం వస్తున్న మెగా హీరో.. క్రేజీ న్యూస్!

ఇప్పుడు మరోసారి అతడితోనే సినిమా చేస్తున్నాడు. వివేక్ కూచిబొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనివార్య కారణాల వలన ఈ సినిమా మధ్యలో ఆగిపోయిందని.. శౌర్య ఈ సినిమా కావాలనే క్యాన్సిల్ చేశాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

దీనిపై స్పందించిన నిర్మాత వివేక్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారంలో నిజం లేదని.. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని.. వీసా సమస్య వలన సినిమా విదేశీ షెడ్యూల్ ఆలస్యమవుతుందని.. దాని వలన షూటింగ్ కి బ్రేక్ పడిందే తప్ప.. ఇంకేం లేదని సినిమా కొనసాగుతుందని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?