విజయ్ దేవరకొండపై దర్శకుడి విమర్శలు..?

By telugu news teamFirst Published Feb 27, 2020, 4:41 PM IST
Highlights

'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత విజయ్ బాడీ లాంగ్వేజ్ చాలా మారిపోయింది. కొన్ని పాత్రలు నటులను వదిలి అంత త్వరగా పోవని 'అర్జున్ రెడ్డి' పాత్రే నిరూపించింది. ఇటీవల వచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో కూడా 'అర్జున్ రెడ్డి' ఛాయలు కనిపించాయనే విమర్శలు వినిపించాయి. 

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస 'పెళ్ళిచూపులు',  'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్నాడు. చాలా మంది దర్శకులు అతడితో కలిసి పని చేయాలని భావిస్తున్నారు. ఎలాంటి పాత్రైనా.. ఒదిగిపోయి నటించడం విజయ్ దేవరకొండ స్వభావం. 'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత విజయ్ బాడీ లాంగ్వేజ్ చాలా మారిపోయింది.

కొన్ని పాత్రలు నటులను వదిలి అంత త్వరగా పోవని 'అర్జున్ రెడ్డి' పాత్రే నిరూపించింది. ఇటీవల వచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో కూడా 'అర్జున్ రెడ్డి' ఛాయలు కనిపించాయనే విమర్శలు వినిపించాయి. హిట్ అవుతుందనుకున్న సినిమా కాస్త ఫ్లాప్ అయింది.

అంతా షాక్: రాఘవేంద్రరావు కొడుకుతో అనుష్క వివాహం..?

ఈ సినిమాతో దర్శకుడు క్రాంతి మాధవ్ బాగా నష్టపోయారనే చెప్పాలి. హీరో విజయ్ దేవరకొండ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి కాబట్టి అతడికి ఎలాంటి సమస్య ఉండదు. కానీ తొలి రెండు సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ కి ఆ తరువాత వచ్చిన 'ఉంగరాల రాంబాబు' ఫ్లాప్ తరువాత తీవ్ర నిరాశకు గురిచేసింది.

దాంతో ఆయన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. దీంతో తన కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందని అనుకున్నారు. స్క్రిప్ట్ పక్కగా సిద్ధం చేసుకొని సెట్స్ పైకి వెళ్లాడు. కానీ ప్రాజెక్ట్ లోకి విజయ్ దేవరకొండ వచ్చిన తరువాత మార్పులు, చేర్పులు మొదలయ్యాయట.

అప్పటికి వరుస విజయాలతో ఊపు మీదున్న విజయ్ దేవరకొండ.. ప్రతీ సన్నివేశాన్ని తనకు అనుగుణంగా మార్చుకున్నాడని.. కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయించారని.. దర్శకుడిగా తనకు పూర్తి స్వేచ్చని ఇవ్వలేదని క్రాంతి మాధవ్ కోపాల్ వహించారట.

అయితే సినిమా ప్రమోషన్స్ సమయంలో ఇవన్నీ మనసులో దాచుకున్న ఆయన రిజల్ట్ చూసిన తరువాత డైరెక్టర్ గా విజయ్ దేవరకొండతోనే తన అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. దర్శకుల పనిలో అనవసరంగా వేలు పెడితే రిజల్ట్ ఇలానే ఉంటుందని క్లాస్ కూడా తీసుకున్నాడట.  

click me!