Celebs Ramp Walk : ర్యాంప్ వాక్ తో ఆకట్టుకున్న సినీ తారలు.. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ కోసం కదిలిన టాలీవుడ్ సెలబ్రెటీస్

Published : Apr 07, 2022, 06:25 PM ISTUpdated : Apr 07, 2022, 06:27 PM IST
Celebs Ramp Walk : ర్యాంప్ వాక్ తో ఆకట్టుకున్న సినీ తారలు.. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ కోసం కదిలిన టాలీవుడ్ సెలబ్రెటీస్

సారాంశం

హైదరాబాద్ లోని మైండ్ స్పేస్ హోటల్ లో ‘టీచ్ ఫర్ ఛేంజ్’ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాంప్ వాక్ లో టాలీవుడ్ సెలబ్రెటీలు అదరగొట్టారు. లేటెస్ట్ అవుట్ ఫిట్స్ తో ఆకట్టుకున్నారు.   

‘టీచ్ ఫర్ ఛేంజ్’ వార్షిక నిధుల సేకరణ్ కార్యక్రమాన్ని ప్రముఖ బిసినెస్ మేన్ రాధా టీఎంటీ ఆధర్వ్ంలో హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ నిధుల సేకరణ కార్యక్రమం వెస్టిన్‌ హైదరాబాద్‌ మైండ్‌స్పేస్‌ హోటల్‌లో ఇటీవల గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా సినీతారలు కూడా ఈ ప్రొగ్రామ్ లో పాల్గొన్నారు. హియా డిజైనర్‌ జ్యువెలరీ వేర్‌తో సినీతారలు ర్యాంప్‌ వాక్‌ చేశారు.
నటి లక్ష్మీమంచు (Manchu Laxmi) నిర్వహణలో  హైదరాబాద్‌ మైండ్‌స్పేస్‌ హోటల్‌లో రాధ టీఎంటీ టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం ఇటీవల జరిగింది. 

ఈ వినూత్నమైన కార్యక్రమంలో  పలువురు సినీ తారలు ర్యాంప్‌ వాక్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలన్న మహోన్నత లక్ష్యంతో నిర్వహించిన ఈ ర్యాంప్‌ వాక్‌కు సుప్రసిద్ధ డిజైనర్‌ ద్వయం శాంతను–నిఖిల్‌ సపోర్ట్ గా నిలిచారు. సెలబ్రిటీలు వీరి కలెక్షన్‌తో పాటుగా హియా డిజైనర్‌ జ్యువెలరీ ధరించి ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అతిథి హైదరీ, ప్రాగ్యా జైస్వాల్, శివాత్మిక, మంచు లక్ష్మీ, సందీప్  కిషన్, సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnagadda) ట్రెడిషనల్ వేర్ లో  ర్యాంప్ వాక్ చేశారు. 

ఈ కార్యక్రమంలో  ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ శ్రీమతి సుధా రెడ్డి, బయలాజికల్‌ ఈ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీమతి మహిమా దాట్ల ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో  శ్రీమతి రేణుకా చౌదరి,  డిప్యూటీ హై కమిషనర్‌–యుకె కాన్సులేట్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌, డాక్టర్‌ జె గీతారెడ్డి, డాక్టర్‌ ఎం మోహన్‌బాబు, కార్పోరేట్‌ లీడర్లు, ప్రభుత్వ అధికారులు– శ్రీ జయేష్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమానికి రాధ టీఎంటీ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించగా,  వెస్టిన్‌ ఆతిథ్యం అందించింది.  

ఈ కార్యక్రమానికి భాగస్వాములుగా  నవ స్కిన్‌ క్లీనిక్‌, లడ్డు బాక్స్‌, సెంట్రో, కమల్‌ వాచ్‌ అండ్‌ కో, స్టెల్లార్‌,  వియ్‌ కనెక్ట్‌,  మింటు శర్మ, రాయల్‌ లియో క్లబ్‌ , వివిడో, సిల్వర్‌ స్టార్‌ మెర్సిడెస్‌ బెంజ్‌ వారు వ్యవహరించాయి. నటులు అదితి రావు హైదరీ, అఖిల్‌ అక్కినేని, లక్ష్మీ మంచు, ప్రగ్యాజైశ్వాల్‌, సందీప్‌ కిషన్‌, మానస వారణాసి,  సుధీర్‌ బాబు, రోహిత్‌ ఖండేల్‌వాల్‌, ఈషా రెబ్బా, అదిత్‌ అరుణ్‌, నవదీప్‌, నివేతా పేతురాజ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో ర్యాంప్‌ వాక్‌ చేశారు.
2014లో చైతన్య ఎంఆర్‌ఎస్‌కె, లక్ష్మీ మంచు ప్రారంభించిన ఈ టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ ట్రస్ట్‌ ఓ జాతీయ ఉద్యమంగా అక్ష్యరాస్యత పెంచడంలో తోడ్పడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యనందించడంలో టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ తోడ్పడుతుంది. తెలంగాణాతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడులలో ఈ సంస్థ కార్యకలాపాలు జరుగుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?