RRR:పావు వంతు కలెక్షన్స్ లేవు కానీ..బిల్డప్,నోటి దూల కేం తక్కువ లేదు

Surya Prakash   | Asianet News
Published : Apr 02, 2022, 07:35 AM IST
RRR:పావు వంతు కలెక్షన్స్ లేవు కానీ..బిల్డప్,నోటి దూల  కేం తక్కువ లేదు

సారాంశం

 ఆర్ఆర్ఆర్ చిత్రం బాలీవుడ్‌లో ప్రభంజనం సృష్టిస్తున్న విషయం గుర్తు చేస్తున్నారు, ఈ సినిమా దెబ్బకు జాన్ నటించిన ఎటాక్ చిత్రం ఏమాత్రం పోటీలో లేకుండా పోయింది.  వాస్తవానికి ఈ చిత్రం హిందీ బెల్ట్‌లో  డీసెంట్ నెంబర్స్ ను కూడా పోస్ట్ చేయలేదు.


బాలీవుడ్ హీరో. హిందీలో కండలవీరుడిగా జాన్ అబ్రహం తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. అనేక హిట్  చిత్రాల్లో కనిపించిన ఈ హీరో కు నోటి దూల కూడా ఎక్కువే అని రీసెంట్ గా సౌత్ సినిమాలపై చేసిన కామెంట్ ద్వారా ప్రూవైంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయన తాజా చిత్రం కలెక్షన్స్ పై పడింది.

తాజాగా జాన్ అబ్రహం నటించిన ‘ఎటాక్’ సినిమా రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జాన్ అబ్రహం మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే.. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఏ సినిమా కూడా రిలీజ్ కావడం లేదని.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి భయపడి బాలీవుడ్ చిత్రాలు తమ రిలీజ్‌ను వాయిదా వేసుకున్నాయని.. జాన్ మాత్రం ఎటాక్ చిత్రాన్ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారని మీడియా వారు ఆయన్ను ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా తాను హిందీ సినిమాల్లో నటించే యాక్టర్‌నని.. దేశంలో హిందీ సినిమానే టాప్ పొజిషన్‌లో ఉందని.. మిగతా ఏ ఇండస్ట్రీకి చెందిన సినిమా కూడా టాప్ స్థానాన్ని దక్కించుకోలేదని ఆయన అన్నారు. అంతేగాక తాను హిందీ సినిమాల్లో మాత్రమే నటిస్తానని, రెమ్యునరేషన్ కోసమో, మరే ఇతర కారణంగానో తాను దక్షిణాది చిత్రాల్లో నటించబోనని చెప్పుకొచ్చాడు. జాన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.  

ఈ నేపధ్యంలో  ఆర్ఆర్ఆర్ చిత్రం బాలీవుడ్‌లో ప్రభంజనం సృష్టిస్తున్న విషయం గుర్తు చేస్తున్నారు, ఈ సినిమా దెబ్బకు జాన్ నటించిన ఎటాక్ చిత్రం ఏమాత్రం పోటీలో లేకుండా పోయింది.  వాస్తవానికి ఈ చిత్రం హిందీ బెల్ట్‌లో  డీసెంట్ నెంబర్స్ ను కూడా పోస్ట్ చేయలేదు. ప్రారంభ ట్రేడ్ అంచనాల ప్రకారం, ఎటాక్ దాని ప్రారంభ రోజున రూ. 2.5 - రూ. 3.5 కోట్లు వసూలు చేసింది. ఇది RRR తొలిరోజు వసూళ్లు  రూ. 20 కోట్లు లో కనీసం సగం కూడా కాదు.     ఎటాక్ ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా ఊపందుకోకపోతే RRR క్రింద నలిగిపోయినట్లే. RRR హిందీ బాక్సాఫీస్ వద్ద మొదటి వారం రూ. 130+ కోట్లను పూర్తి చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?