మోహన్ లాల్ నన్ను తొక్కేశారు, పేరులో 'రాజు' వల్ల ఆ కులం డైరక్టర్..!

By AN TeluguFirst Published Jan 27, 2020, 11:26 AM IST
Highlights

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన 'వియత్నం కాలని' సినిమాలో  ఆయన విలన్ గా చేశాను. ఆ సినిమాలో విలన్ పాత్రకి మంచి ఆదరణ లభించింది. మోహన్ లాల్ పాత్రకంటే ఆయన పాత్రకి ఎక్కువ గుర్తింపు వచ్చింది. 

'భైరవద్వీపం' సినిమా ద్వారా తెలుగు తెరకి విలన్ గా పరిచయమైన నటుడు విజయరంగరాజు. ఆయన ఇంతవరకు తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ .. పంజాబీ .. మరాఠీ .. ఒరియా .. ఇలా చాలా భాషల్లో నటించాను. 5 వేల సినిమాల వరకూ చేశాను.  అయితే ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమా మాత్రం మలయాళంలో వుంది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన 'వియత్నం కాలని' సినిమాలో  ఆయన విలన్ గా చేశాను.

ఆ సినిమాలో విలన్ పాత్రకి మంచి ఆదరణ లభించింది. మోహన్ లాల్ పాత్రకంటే ఆయన పాత్రకి ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆ  పాత్ర కారణంగా ఆ సినిమా 250 రోజులు ఆడటం విశేషం. మోహన లాల్ సైతం ఆశ్చర్యపోయాడు. అయితే అదే ఆయన్ని దెబ్బ కొట్టింది. ఆ తర్వాత ఆఫర్స్ తగ్గిపోయాయి. ఈ విషయం స్వయంగా ఆయన మీడియాతో పంచుకున్నారు.

ప్రాణాపాయ స్థితిలో ప్రముఖ దర్శకుడు.. విచారంలో ఇండస్ట్రీ!

ఆయన మాట్లాడుతూ.. "మోహన్ లాల్ హీరోగా .. నేను విలన్ గా 'వియత్నం కాలని' సినిమా చేశాము. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్రకంటే నా పాత్రకి ఎక్కువ గుర్తింపు వచ్చేసింది. ఆ తరువాత నాకు మలయాళంలో అవకాశాలు రాలేదు. చాలాకాలం తరువాత నాకు దర్శకుడు సిద్ధిక్ గారు తారసపడ్డారు. నాకు మలయాళంలో అవకాశాలు రాకపోవడానికి మోహన్ లాల్ కారకులని చెప్పారు. నా కాంబినేషన్లో చేయనని నిర్మాతలకి మోహన్ లాల్ చెప్పడం వల్లనే వాళ్లు తనని పక్కన పెట్టేశారని అన్నారు. చాలా అవకాశాలు .. వాటివలన రావలసిన డబ్బులు పోవడంతో చాలా బాధపడ్డాను" అని చెప్పుకొచ్చారు.

అలాగే "నా అసలు పేరు ఉదయ్ రాజ్ కుమార్. తొలినాళ్లలో రాజ్ కుమార్ పేరుతో ఫైటర్ గా కొన్ని సినిమాలు చేశాను. 'భైరవద్వీపం' సినిమా సమయంలో దర్శక నిర్మాతలు నా పేరును మారుస్తున్నట్టు చెప్పారు. విజయ ప్రొడక్షన్స్ పై ఈ సినిమా రూపొందుతుంది గనుక 'విజయ' అని .. ఎస్వీ రంగారావు తరహా పాత్రను చేస్తున్నాను గనుక 'రంగ' అని .. నా అసలు పేరులోని 'రాజ్' కలిసొచ్చేలా 'విజయరంగరాజు'గా మార్చారు. ఈ పేరు నాకు బాగానే కలిసొచ్చింది. నా పేరు చివరిలో 'రాజు' అని ఉండటం వలన, వేరే కులానికి చెందిన ఒక డైరెక్టర్ ఐదారు వేషాలు నాకు ఇవ్వలేదని స్వయంగా చెప్పాడు" అంటూ నవ్వేశారు.
 

click me!