'మిర్జాపూర్' నటుడి మృతి, కుళ్లిపోయిన స్థితిలో దేహం

By Surya PrakashFirst Published Dec 3, 2021, 7:35 AM IST
Highlights

వీరు చేరుకునే సమయానికి ఆ ఇంటికి తాళం వేసి ఉంది. అనంతరం డూప్లికేట్ కీ సహాయంతో ఇంటిని తెరిచారు. ఇంటిని తెరవగానే అతడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభించింది. 

సూపర్ 30, దంగల్ వంటి చిత్రాల్లో నటించి పాపులరైన నటుడు బ్రహ్మ స్వరూప్ మిశ్రా. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన మిర్జాపూర్ వెబ్‌సిరీస్‌తో పేరు సంపాదించుకున్నాడు. మిర్జాపూర్ వెబ్‌సిరీస్ లో మున్నా భయ్యాకు సహాయకుడిగా బ్రహ్మ స్వరూప్ మిశ్రా నటించాడు.తాజాగా ఈ నటుడు అకాల మరణం చెందాడు.  బ్రహ్మ స్వరూప్ మిశ్రా గుండెపోటుతో మరణించాడని వైద్యులు నిర్ధారించారు.

ముంబై వర్సోవాలోని  సోసైటీలో ఒక ఇంటిలో అతడు అద్దెకుండేవాడు. గత 4 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాడు. అతడి నివాసం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వీరు చేరుకునే సమయానికి ఆ ఇంటికి తాళం వేసి ఉంది. అనంతరం డూప్లికేట్ కీ సహాయంతో ఇంటిని తెరిచారు. ఇంటిని తెరవగానే అతడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభించింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మధ్యప్రదేశ్‌లో నివసించే అతడి సోదరుడు సందీప్‌కి సమాచారం అందించారు.

ఇక ‘మిర్జాపూర్‌’.. ఇప్పుడు ఉత్తరాదిన హాట్‌టాపిక్‌ ఇదే. సినిమాలకు ధీటుగా వినోదం పంచగలమని ఈ వెబ్‌సిరీస్‌ నిరూపించింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ప్రైమ్‌ వీడియోలో అత్యంత ఆదరణ పొందిన వెబ్‌సిరీస్‌గా రికార్డు సృష్టించింది. ఎంతటి విజయం సాధించిందో అదేస్థాయిలో వివాదాలనూ ఎదుర్కొంటోంది. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌ పట్టణంలో జరిగే రౌడీయిజం, హింస నేపథ్యంలో తెరకెక్కిందీ సిరీస్‌. ఇప్పటికే వచ్చిన సీజన్‌1, సీజన్‌2 ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

Also read టాలీవుడ్ లో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత మృతి

 సీజన్‌3 కూడా తెరకెక్కిస్తున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ గతంలోనే ప్రకటించింది. అయితే.. అదే సమయంలో హింసను ప్రేరేపించడంతో పాటు మిర్జాపూర్‌ పట్టణాన్ని తప్పుగా చూపిస్తున్నారంటూ వెబ్‌సిరీస్‌పై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈక్రమంలో సుప్రీంకోర్టు నుంచి కూడా నోటీసులు రావడంతో మిర్జాపూర్‌ సీజన్‌3పై నీలినీడలు కమ్ముకున్నాయి.  
 

click me!