Sirivennela హెల్త్‌ అప్డేట్: ‘సిరివెన్నెల’ ఇంకా ఐసీయులోనే ...

Surya Prakash   | Asianet News
Published : Nov 30, 2021, 07:35 AM ISTUpdated : Nov 30, 2021, 07:46 AM IST
Sirivennela హెల్త్‌ అప్డేట్:  ‘సిరివెన్నెల’ ఇంకా ఐసీయులోనే ...

సారాంశం

 “విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం” అంటూ మొదలన ఆయన పాటల ప్రయాణం నిర్విరామంగా కొనసాగుతుంది. రుద్రవీణ సినిమాలో నమ్మకు నమ్మకు ఈ రేయినీ అనే పాట .. లలిత ప్రియ కమలం విరిసినదీ అనే పాటలను అద్భుతంగా రాసారు సిరివెన్నెల. లలిత ప్రియా కమలం పాటకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.

ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు  ఆరు రోజుల కిందట ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో ఆయనకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.  ఈ నేపథ్యంలో కిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశాయి.

‘టాలీవుడ్‌ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ నవంబరు 24న ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటిప్పుడు పరిశీలిస్తున్నారు. ఐసీయూలో ఉన్న సీతారామశాస్త్రి త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. సిరివెన్నెల ఆరోగ్యం పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం’ అని కిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

 సిరివెన్నెల న్యూమెనియాతో బాధపడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇక  తన సాహిత్యంతో పాటకు ప్రాణం పోస్తారు సిరివెన్నెల.. “విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం” అంటూ మొదలన ఆయన పాటల ప్రయాణం నిర్విరామంగా కొనసాగుతోంది. మొదటి సినిమాతోనే తనలోని సరస్వతిని దర్శక దిగ్గజం కళాతపస్వి కె విశ్వనాథ్ కు పరిచయం చేసారు సిరివెన్నెల. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే.. అలాగే రుద్రవీణ సినిమాలో నమ్మకు నమ్మకు ఈ రేయినీ అనే పాట  .. లలిత ప్రియ కమలం విరిసినదీ అనే పాటలను అద్భుతంగా రాసారు సిరివెన్నెల.  లలిత ప్రియా కమలం పాటకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?