సినీ పరిశ్రమపై పడ్డారు.. రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టండి.. ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి ఆగ్రహం..

Published : Aug 08, 2023, 02:24 PM IST
సినీ పరిశ్రమపై పడ్డారు.. రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టండి.. ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి ఆగ్రహం..

సారాంశం

మోగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకూ ఏపి ప్రభుత్వంపై మాట్లాడని మెగాస్టార్.. ఈసారి ఏకంగా గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.    

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యలు చాలా ఉంటే.. పిచ్చుక మీద బ్రహ్మస్త్రంలా  సినీపరిశ్రమపై పడి ఏడుస్తున్నారంటూ మండి పడ్డారు. మీ ప్రతాపం సినీ పరిశ్రమపై కాదు.. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులపై చూపండి అంటూ.. ఏపీ ప్రభుత్వ తీరుపై మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమధ్య సినీ పరిశ్రమపై కొందరు చేస్తున్న వ్యాక్యలు.. మంత్రుల మాటలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టండి...ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టండి... అప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు. అంతే కాదు ఇండస్ట్రీపై అక్కసు ఎందుకు అన్నట్టుగ్గా బ్లాస్ట్ అయ్యారు మెగాస్టార్. 

మెగాస్టార్ చిరంజీవి..  మాస్‌మహారాజ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య  సినిమా 200 రోజులు పూర్తి చేసుకుంది. కొన్నిసెంటర్ల లో  ఈసినిమా డబుల్ సెంచరీ కొట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన ద్విశతదినోత్సవ వేడుకల్లో ఆయన ఈ వాఖ్యలు చేశారు.చిరంజీవి మాట్లాడుతూ గత కొన్నేళ్ళుగా ఫిల్మ్ ఇండస్ట్రీని చుట్టుముడుతున్న రాజకీయాంశాలను ప్రస్తావించారు. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం గురించి ఆలోచించాలని, సంక్షేమ పథకాలు, ఉద్యోగ-ఉపాధి అంశాలపై దృష్టిసారించాలన్నారు. పేదరికం కడుపు నింపే దిశగా ఆలోచించాలని, అలాచేసినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు. అప్పుడు తాను కూడా తలవంచుతాను.. అంతేగానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఒకప్పుడు సినిమాలు 100 రోజులు, 150, 175, 200 రోజులు ఆడేవి.. ఇప్పుడు ఎంత  పెద్ద సినిమా అయినా.. 2 వారాలకంటే ఎక్కువగా థియేటర్లో ఉండదు.. అప్పటికి ఇప్పటికి రోజులు మారాయి. కాని ఇలాంటి టైమ్ లో కూడా వాల్తేరు వీరయ్య సినిమా ఇలా  200 రోజులు థియేటర్లలో ఆడటం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు.. మాస్ మహారాజ్ రవితేజ, ఈసినిమా దర్శకుడు బాబీ, మైత్రీమూవీ మేకర్స్ కూడా పాలుపంచుకున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈనెల 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్దం అవుతోంది. మెహార్ రమేష్ చాలా గ్యాప్ తరువాత డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా లో హీరోయిన్ గా తమన్న నటించగా... మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటించారు. అక్కినేని హీరో సుశాంత్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో మెరిశారు. 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?