చిరంజీవి, సురేఖ పెళ్లి చూపులు అలా జరిగాయి.. మెగాస్టార్ అహం దెబ్బతినిందట!

By tirumala AN  |  First Published Feb 16, 2020, 12:43 PM IST

వీరిద్దరి పెళ్లి చూపులు చాలా సరదాగా జరిగాయట. ఆ సంగతులని చిరంజీవి వివరిస్తూ.. నేను చెన్నైలో కోడంబాకం బ్రిడ్జ్ పై నా కారులో వెళుతున్నా. నా క్లాస్ మేట్ సత్యనారాయణ కనిపించాడు. ఎక్కడికి వెళుతున్నావు అని అడిగా. మా పెదనాన్న ఇంటికి వెళుతున్నాని చెప్పాడు.


మెగాస్టార్ చిరంజీవి, సురేఖ టాలీవుడ్ లో అన్యోన్య దంపతులనే సంగతి తెలిసిందే.చిరంజీవి సినిమాలతో బిజీగా ఉంటే.. సురేఖ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా వీరిద్దరూ కలసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమ పెళ్లినాటి సంగతులు పంచుకున్నారు. 

వీరిద్దరి పెళ్లి చూపులు చాలా సరదాగా జరిగాయట. ఆ సంగతులని చిరంజీవి వివరిస్తూ.. నేను చెన్నైలో కోడంబాకం బ్రిడ్జ్ పై నా కారులో వెళుతున్నా. నా క్లాస్ మేట్ సత్యనారాయణ కనిపించాడు. ఎక్కడికి వెళుతున్నావు అని అడిగా. మా పెదనాన్న ఇంటికి వెళుతున్నాని చెప్పాడు. కారులో దిగబెడతా అని అతడిని ఎక్కించుకున్నా. 

Latest Videos

వాళ్ళ పెదనాన్న ఎవరో కాదు.. అల్లు రామలింగయ్య గారు. అప్పటికి నేను మూడు చిత్రాల్లో నటించా. మా పెదనాన్నతో నీవు కూడా నటించావుగా..లోపలి రా.. కాఫీ తాగి వెళ్లు అని పిలిచాడు. ఆ సమయంలో రామలింగయ్య గారు ఇంట్లో లేరు. వాళ్ళ అమ్మాయి సురేఖ, కుటుంబ సభ్యులు ఉన్నారు. సురేఖే కాఫీ పెట్టింది. అదే నేను లాక్ అయిన మొదటి స్టెప్ అని చిరంజీవి నవ్వుతూ తెలిపారు. 

ఆ అబ్బాయి ఎవరు.. కుల గోత్రాలు ఏంటి అని మా ఫ్రెండ్ తో సురేఖ ఆరా తీసిందట. మనవాడే అని నా ఫ్రెండ్ నా గురించి చెప్పాడు. ఆ తర్వాత అల్లు అరవింద్ గారు నా గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. నేను బాగా చదువుకున్నానని, చెడు అలవాట్లు లేవని నా ఫ్రెండ్ అల్లు అరవింద్ తో నా గురించి బాగా చెప్పాడు. చేతిలో మంచి సినిమాలు కూడా ఉన్నాయని తెలిపాడు. 

పలువురు నిర్మాతలనికూడా నా గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాతే మా ఫ్యామిలీని సంప్రదించారు. నేను మాత్రం ఇప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పాను. కానీ అల్లు రామలింగయ్య గారు మా నాన్నని బలవంతపెట్టారు. అలా పెళ్లి చూపులకు వెళ్లాం. సురేఖ మాట్లాడుతూ.. ఆయన్ని చూడడం కంటే ముందుగానే మనవూరి పాండవులు చిత్రం చూశా. ఈ అబ్బాయి చాలా బావున్నాడు..పెద్ద కళ్ళు, గుండ్రంగా ఉన్నాయి అని అనిపించింది. 

సౌత్ దర్శకులు, హీరోల డ్రీమ్స్.. నెరవేరే ఛాన్స్ ఉందా!

మా నాన్న నటుడు. నేను కూడా నటుడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకునే దాన్ని. అలా చిరంజీవితో పెళ్లి చూపులకు ఒప్పుకున్నా. పెళ్లి చూపుల గురించి చిరంజీవి మాట్లాడుతూ.. మమ్మల్ని మాట్లాడుకోమని పెద్దవాళ్ళు బయటకు వెళ్లారు. ఆమె బీఏ చదువుకుందని తెలుసు.. కానీ ఏం మాట్లాడాలో తెలియక ఏం చదువుకున్నారు అని అడిగాను. సురేఖ నాకు నచ్చింది. మా ఇంట్లోవాళ్లకు కూడా నచ్చింది. అలా పెళ్లి చూపులు ముగిశాయి. ఇప్పట్లోలా అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా. 

హీరోయిన్ పై 'బి గ్రేడ్' కామెంట్స్.. సిగ్గులేదా అంటూ విరుచుకుపడ్డ నటి!

ఒకసారి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశాను. సురేఖనే ఫోన్ లిఫ్ట్ చేసింది. నేను సురేఖని మాట్లాడుతున్నా.. ఫోన్ ఎవరికీ ఇమ్మంటారు అని అడిగింది.. తన కోసం ఫోన్ చేసే ఇలా మాట్లాడుతోంది ఏంటి అని నా అహం దెబ్బతింది. మీ అన్నయ్య ఉన్నాడా అని అడిగి ఫోన్ పెట్టాశా అని చిరంజీవి అన్నారు. పెళ్లి పనుల కోసం పెద్దవారితోమాట్లాడడానికి ఫోన్ చేశారేమో అని తాను భావించినట్లు సురేఖ చెప్పుకొచ్చింది. 

 

 

click me!