చిరు 152: కొరటాల మూవీలో కూడా మెగా డాటర్ ప్రమేయం!

By tirumala ANFirst Published Jan 3, 2020, 9:10 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి కొత్త ఏడాది కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. గత ఏడాది చిరంజీవి నుంచి సైరా నరసింహారెడ్డి లాంటి భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇతర భాషల్లో కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.

మెగాస్టార్ చిరంజీవి కొత్త ఏడాది కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. గత ఏడాది చిరంజీవి నుంచి సైరా నరసింహారెడ్డి లాంటి భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇతర భాషల్లో కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. తెలుగులో మాత్రం మంచి విజయం సాధించింది. 

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శత్వంలో నటిస్తున్నారు. మిర్చి చిత్రంతో దర్శకుడిగా మారిన కొరటాలకు ఇతవరకు పరాజయమే లేదు. దీనితో చిరంజీవి 152వ చిత్రంపై ప్రారంభం నుంచి మంచి అంచనాలు నెలకొంటున్నాయి. చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రంతో సెకండ్ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత మునుపటి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. రీఎంట్రీ తర్వాత చిరు తన ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. 

బాలయ్య హీరోయిన్ పరిస్థితి ఏంటి ఇలా.. ఆ లాయర్ కూడా అలాంటివాడే!

ఖైదీ నెం 150, సైరా రెండు చిత్రాలు రాంచరణ్ నిర్మాతగా సొంత బ్యానర్ లో తెరకెక్కినవే. ఇక చిరంజీవి కుమార్తె సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తోంది. సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా మేనేజ్ చేస్తోంది. పూర్తిస్థాయిలో మెగాస్టార్ ని స్టైలిష్ లుక్ లో చూపించేలా కాస్ట్యూమ్స్ ఎంపిక జరగట్లేదనే విమర్శ కొంత మంది అభిమానుల్లో నెలకొని ఉంది. 

మహేష్ కోసం వెంటపడి మరీ.. సినిమాల్లో ఆమె లేడీ సింగం!

తాజాగా కొరటాల శివ చిత్రానికి కూడా సుస్మితనే కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రంలో ఆమె పనితనం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. చిరు 152 చిత్రానికి బెస్ట్ అవుట్ పుట్ అందించేందుకు తన వంతు కృషి చేస్తానని సుస్మిత ట్వీట్ చేశారు. కొరటాల శివ హీరోలని స్టైలిష్ గా చూపించడం లో ఏమాత్రం కాంప్రమైజ్ కారు. 

Starting off the year with this exciting project. Looking forward to a great experience and doing my best. @MatineeEnts https://t.co/1HhqKIMoTn

— sushmita konidela (@sushkonidela)

ఈ చిత్రం దేవాదాయ శాఖలో జరుగుతున్నా అవినీతి నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి దేవాదాయశాఖ ఉద్యోగిగా కనిపించనున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ స్వరాలు సమకూర్చనున్నారు. 

click me!