రవితేజ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ధమాకా’ నుంచి సాలిడ్ అనౌన్స్ మెంట్.!

Published : Oct 05, 2022, 06:43 PM IST
రవితేజ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ధమాకా’ నుంచి సాలిడ్ అనౌన్స్ మెంట్.!

సారాంశం

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘ధమాకా’ (Dhamaka) మూవీ నుంచి  తాజాగా అదిరిపోయే అప్డేట్ అందింది. దసరా సందర్భంగా అభిమానుల కోసం సాలిడ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.   

మాస్ మహారాజా రవితేజ (Raviteja) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రాల్లో యాక్షన్ ఫిల్మ్ ‘ధమాకా’ ఒకటి . ఈ చిత్రం కూడా రిలీజ్ కు సిద్ధం అవుతోంది గతేడాది ప్రారంభమవగా హైదరాబాద్, స్పెయిన్ లో చిత్రీకరణను ఎక్కువ శాతం పూర్తి చేశారు. ప్రస్తుతం షూటింగ్  తుది దశలో ఉంది. మరికొద్ది రోజుల్లో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈక్రమంలో సినిమాపై అంచనాలు పెంచేందుకు చిత్ర యూనిట్ ఆసక్తికరంగా అప్డేట్స్ ను అందిస్తూనే ఉన్నారు. దసరా పండుగ సందర్భంగా తాజాగా సాలిడ్ అనౌన్స్ మెంట్ ను అందించారు.

ఇప్పటికే ‘ధమాకా’ చిత్రం నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు, గ్లింమ్స్  కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఈ క్రమంలో దివాళి అంటేనే క్రాకర్, ధమాకా అంటే మాస్ క్రాకర్ అంటూ అదిరిపోయే అప్డేట్ ను వదిలారు. దీపావళి సందర్భంగా ఈ  అప్డేట్ ను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 21న ఉదయం 10.01 నిమిషానికి మూవీ నుంచి  సర్ ప్రైజ్ లు వస్తున్నాయని మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. అప్డేట్ అందిస్తూ మూవీలోని  రవితేజ సాలిడ్ స్టిల్ పోస్టర్ ను వదిలారు. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మాస్ మహారాజ ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఈ అప్డేట్ తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

‘ధమాకా’లో హీరోహీరోయిన్లుగా రవితేజ - శ్రీలీలా నటిస్తున్నారు. త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.  జయరామ్, సచ్చిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, రావు రమేశ్, అలీ, హైపర్ ఆది, పవిత్రా లోకేష్ తదితరులు ఆయా పాత్రల్లో నటిస్తున్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’తో నిరాశ పరిచిన రవితేజ తదుపరి  చిత్రాలపై మరింత ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ‘ధమాకా’తో పాటు ‘రావణాసుర’,‘టైగర్ నాగేశ్వర్ రావు’లో నటిస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?