ఆదిపురుష్ సినిమా డైరెక్టర్‌ కు మధ్యప్రదేశ్ హోం మంత్రి వార్నింగ్.. అవి తొలగించండి లేదంటే లీగల్ యాక్షన్

By Mahesh KFirst Published Oct 4, 2022, 4:15 PM IST
Highlights

మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా.. ఆదిపురుష్ డైరెక్టర్ ఓమ్ రౌత్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఆదిపురుష్ ట్రైలర్‌ తాను చూశానని, అందులో కొన్ని సీన్లు మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని వెంటనే తొలగించాలని, లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

భోపాల్: మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మంగళవారం బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఆదిపురుష్ సినిమాను ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తుండగా.. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్, సీతగా క్రితి సనన్ నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది.

ఈ టీజర్‌లో సోషల్ మీడియాలో పెద్ద చర్చను లేవదీసింది. ఆ ట్రైలర్‌లో పాత్రలు యానిమేటెడ్‌గా ఉన్నాయని, అనేక లోపాలు ఉన్నాయని నెటిజన్లు పేర్కొన్నారు. మేకప్, వీఎఫ్ఎక్స్ సహా అనే విషయాలను ప్రస్తావిస్తూ ట్రోల్ చేశారు. రెండు రోజులుగా బ్యాన్ ఆదిపురుష్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.

రాముడి చెప్పులు మొదలు అనేక లోపాలను ఆ క్యారెక్టర్ డిజైన్‌లో లేవనెత్తారు. వానరాలు గొరిల్లాలుగా ఉన్నాయని, హనుమంతుడి రూపం ఇతర మతస్తుల వలే ఉన్నదని, రావణుడి పాత్రపైనా విమర్శలు కుప్పలుగా వచ్చాయి. అంతేకాదు, సుమారు ఏడు ఎనిమిది హాలీవుడ్ సినిమాల పేర్లు ఏకరువు పెట్టి అందులో నుంచి ఎఫెక్ట్స్ ఎత్తుకొచ్చినట్టుగా ఉన్నాయని కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరేత్తమ్ మిశ్రా తాజాగా వార్నింగ్ ఇచ్చారు.

Also Read: VFX వర్క్ మేం చేయలేదు,వాటితో మాకు సంబంధం లేదని సంస్ద ప్రకటన

హిందూ మత దేవుళ్లను తప్పుగా చూపించిన సీన్లను తొలగించాలని హోం మినిస్టర్ ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓమ్ రౌత్‌ను ఆదేశించారు. లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ‘నేను ఆదిపురుష్ ట్రైలర్ చూశాను. ఇందులో అభ్యంతరకర సీన్లు ఉన్నాయి’ అని అన్నారు. ట్రైలర్‌లో చూపిన హిందూ దేవుళ్ల లుక్, వారి డ్రెస్సులను యాక్సెప్ట్ చేయబోమని వివరించారు.

‘హనుమాన్ జీ లెదర్ ధరించినట్టుగా ఉన్నది. అదే రామాయణంలో ఆయన కాస్ట్యూమ్స్ చిత్రణ భిన్నంగా ఉన్నది. మతపరమైన భావోద్వేగాలను బాధపెట్టే సీన్లు కొన్ని ఉన్నాయి. అలాంటి సీన్లు అన్నింటినీ సినిమా నుంచి తొలగించాలని నేను ఓమ్ రౌత్‌కు లేఖ రాస్తున్నాను. తొలగించకుంటే మేం లీగల్ యాక్షన్ తీసుకుంటాం’ అని హెచ్చరించారు.

ఫిల్మ్ మేకర్లకు ఇలా వార్నింగ్ ఇవ్వడం నరోత్తమ్ మిశ్రాకు కొత్తేమీ కాదు. గతంలోనూ పలు సినిమాలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.

click me!