
స్టార్ హీరో విజయ్ దేవరకొండ - మృణాల్ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ Family Star. సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ రిలీజైంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా వచ్చే ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించారు. మంగ్లి, కార్తీక్ ఎనర్జిటిక్ గా పాడారు. గోపీ సుందర్ మంచి డ్యాన్స్ నెంబర్ కంపోజ్ చేశారు. ఈ పాటలో విజయ్, మృణాల్ మేకోవర్, అప్పీయరెన్స్, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. పరశురామ్ పెట్ల దర్శకుడు. ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
రావు రమేశ్ హీరోగా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమా..
తెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుడు రావు రమేష్ (Rao Ramesh). తండ్రి రావు గోపాలరావుకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ ఆర్టిస్ట్. హీరోలు, నటీనటులు ఎంతో అభిమానించే వ్యక్తి. అతనితో నటించాలని కోరుకునే వాళ్ళెందరో! వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్... 'మారుతి నగర్ సుబ్రమణ్యం' (Maruthi Nagar Subramanyam) సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ (Indraja) నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. కాగా ఈ రోజు ఆసక్తికరమైన సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటి అడక్కు‘ సినిమా టీజర్..
అల్లరి నరేష్ (Allari Naresh) ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అల్లరి నరేశ్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‍గా నటించారు. వెన్నెల కిశోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ కీలకపాత్రలు పోషించారు. చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. ఇటీవల ఈ చిత్రం నుంచి వరుసగా అప్డేట్స్ అందుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇంట్రెస్టింగ్ గా టీజర్ ను విడుదల చేశారు. పెళ్లి కోసం అల్లరి నరేశ్ పడే తంటాలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ సినిమాతో మళ్లీ అల్లరి నరేశ్ మార్క్ కనిపించబోతుందని తెలుస్తోంది.
‘షరతులు వర్తిస్తాయి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్..
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’ (Sharathulu Varthisthai). కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. "షరతులు వర్తిస్తాయి" సినిమా ఈ నెల 15న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హీరో ప్రియదర్శి ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కుమారస్వామి, హీరో చైతన్య రావ్. దర్శకుడు వేణు ఊడుగుల, యాక్టర్ ప్రియదర్శి, హీరోయిన్ భూమి శెట్టి, నిర్మాత డాక్టర్ కృష్ణకాంత్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శేఖర్ పోచంపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ చిలువేరు సినిమా గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ యూ సర్టిఫికేట్ రావడం విశేషం.