పేదవాడికి వినోదం ఏది: ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌పై ఆర్ నారాయణ మూర్తి సంచలన కామెంట్స్

By Siva KodatiFirst Published Jul 28, 2021, 7:33 PM IST
Highlights

మధ్య తరగతి, బడుగు వర్గాల ఇళ్ళల్లో ఓటిటి లేదని.. మరి వాళ్లకి వినోదం అందించడం ఎలా అని నారాయణ మూర్తి ప్రశ్నించారు. థియేటర్‌లో సినిమా చూడడం ఒక పండుగ అన్న ఆయన.. థియేటర్ అనుభూతే వేరని స్పష్టం చేశారు. 

ఓటిటి ప్లాట్ ఫోమ్స్‌పై పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ఇటీవల ఓటిటిలో రిలీజ్ అయిన నారప్ప సినిమాను తెలుగు రాష్ట్రాలలో కేవలం 25 శాతం మంది మాత్రమే చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్య తరగతి, బడుగు వర్గాల ఇళ్ళల్లో ఓటిటి లేదని.. మరి వాళ్లకి వినోదం అందించడం ఎలా అని నారాయణ మూర్తి ప్రశ్నించారు.

థియేటర్‌లో సినిమా చూడడం ఒక పండుగ అన్న ఆయన.. థియేటర్ అనుభూతే వేరని స్పష్టం చేశారు. వెంటనే సినిమా థియేటర్స్ తెరుచుకునే విధంగా చూడాలని నారాయణ మూర్తి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. కరోనాతో అందరూ ఫైట్ చేయాల్సిందేనని.. కానీ పేదవాడికి వున్న ఒకే ఒక్క వినోదం థియేటర్ అని నారాయణ మూర్తి వెల్లడించారు.

Also Read:నాకెలాంటి ఆర్ధిక కష్టాలు లేవు.. అవాస్తవాలు రాయకండి : ఆర్ నారాయణ మూర్తి

సినిమా బతకాలి అదే సమయంలో థియేటర్స్ బతకాలి అని ఆయన ఆకాంక్షించారు. సినీ పరిశ్రమ పెద్దలు కూడా సినిమా థియేటర్ ఓపెన్ అయేటట్టు చూడాలని నారాయణ మూర్తి విజ్ఞప్తి చేశారు. మనిషి వున్నంత కాలం థియేటర్ వుంటుందని.. థియేటర్ లేకపోతే స్టార్ డమ్‌లు వుండవని పేర్కొన్నారు. పరిశ్రమ పెద్దలు సినిమాలను ఓటిటికి రిలీజ్ చెయ్యకుండా థియేటర్‌లో రిలీజ్ అయ్యేటట్టు చూడాలని నారాయణ మూర్తి కోరారు. 

click me!