
‘ఉయ్యాల జంపాల’ సినిమాలో సునీత పాత్రలో కూల్‌గా, క్యూట్‌గా ముద్దుముద్దు పలుకులతో ఆకట్టుకుంది పునర్నవి భూపాలం. అమాయకత్వం నిండిన టీనేజర్‌గా తన నటనతో యావత్ ప్రేక్షక, చిత్రలోకాన్ని తనవైపునకు తిప్పుకొంది. ఆ తర్వాత హీరోయిన్‌గానూ అనేక అవకాశాలను అందిపుచ్చుకుంది. అయితే అంతగా ఆడకపోవటంతో.. ఆమెకు పేరు రాలేదు. తాజాగా బిగ్ బాస్–3 కంటెస్టెంట్‌గా పాపులరైంది. హీరోయిన్‌గా మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
నాలుగైదు ఏళ్ల క్రితమే పూర్తై ఆగిపోయిన ఈ చిత్రం పునర్నవికు వచ్చిన క్రేజ్ తో మళ్లీ బయిటకు వచ్చింది. ఈ సినిమాను అప్పట్లో ఎంత పనిచేసావే శిరీషా టైటిల్ తో రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే రకరకాల కారణాలతో ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు టైటిల్ మార్చి...సైకిల్ గా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టిజర్ ని దర్శకడు వివి వినాయక్ విడుదల చేసారు.
వారెవా.. బాలయ్య లుక్.. మళ్ళీ సర్‌ప్రైజ్ చేశాడు!
ఇందులో హీరోగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రంతో పరిచయం అయిన మహత్ రాఘవేంద్ర నటిస్తున్నాడు. .దురదృష్ణవంతుడి లాటరీని అదృష్టవంతుడి జాతకాన్ని అస్సలు నమ్మకూడదు అంటూ ఫన్నీగా టిజర్ సాగుతుంది. కమెడియన్ సుదర్శన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి ఆట్ల అర్జున్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా గ్రే మీడియా సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది..సతీశ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.