
దేశముదురు చిత్రంలో క్యూట్ గా కనిపించి ఇట్టే ఆకట్టుకున్న హన్సిక...అలా సినీ పరిశ్రమలో సెటిలై..వరసగా తెలుగు,తమిళ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తోంది. తాజాగా నిన్న విడుదలైన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో అమాయకపు లాయర్ పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో ఆమె తండ్రి (మురళీ శర్మ) పెద్ద లాయర్. నేను చాలా తెలివైనదాన్ని అని హన్సిక ఫీలింగ్. సెక్షన్స్ అన్నీ తికమకగా చెప్పేస్తూంటుంది.
తెనాలి రామకృష్ణతో తొలుత గొడవ, ఆ తర్వాత ప్రేమలో పడుతుంది. తర్వాత వాళ్లిద్దరూ కలిసి ఓ కేసుని ఎలా డీల్ చేశామన్నది ఈ చిత్ర కథ. వింటానికి అంతా బాగానే ఉన్నా...చూడటానికే హన్సిక కష్టమనిపించింది. ఈ సినిమాలో హన్సిక ను చూసిన వారు..ఆమె ఏంటి ఇలా అయిపోయిందంటి అని కామెంట్స్ చేసారు. కొందరైతే హన్సికని ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదన్నారు. ఆమె మొహమంతా క్యారీ బ్యాగులే కనిపించాయి అని రివ్యూలులో సైతం రాసారు.
దిల్ రాజుకి ప్రభాస్ టెన్షన్, రాత్రింబవళ్లూ అదే ఆలోచన!
నవ్వితే అస్సలు చూడలేకపోయాం అనే టాక్ వినిపించింది. ఎందుకు హన్సిక ఇలా తయారైంది. బబ్లిగా ఉండే హన్సిక..ఏమన్నా డైటింగ్ టిప్స్ పాటించి ఇలా తయారైందా..లేక వేరే ఏ ఇతర కారణాలతో ఇలా ఉందా..ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ అనటానికి ఆమెది పెద్ద వయస్సు ఏమీ కాదు. ఆమె కన్నా పెద్దవాళ్లు హీరోయిన్స్ గా ఇంకా గ్లామర్ ని మెయింటైన్ చేస్తూ ఫామ్ లో ఉన్నారు. మరి హన్సిక ఇలా ఎందుకు కనిపిస్తోందో చెక్ చేసుకోవాలి. దానికి తోడు ఆమెకు చేసిన మేకప్ కూడా చాలా అగ్లీగా తయారు చేసింది. ఇలాగే ఉంటే కనుక కెరీర్ కష్టమవుతుందనటంలో సందేహం లేదు.
ఇప్పటిదాకా దాదాపు 50 సినిమాలు పూర్తి చేసిన ఆమె ...ప్రస్తుతం తెలుగులో అమే జాన్ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ‘భాగమతి’ దర్శకుడు అశోక్ డైరెక్టర్. షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం యూత్ ఎలా ఉంది? అనే యాంగిల్‌లో కథ సాగుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ వెబ్ సిరీస్ బయటకు రానుంది. వరుసగా తమిళ సినిమాలు చేయడంతో తెలుగులో చిన్న గ్యాప్ ఏర్పడింది. కానీ, తెలుగు సినిమా అవకాశం ఎప్పుడు వచ్చినా చేస్తుంటాను. పాత్ర బావుంటే భాషతో నాకు పట్టింపు లేదు. నా పాత్రని ఎలా చేశా అన్నదే ముఖ్యం అని హన్సిక చెప్తోంది.