ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి సినీ రంగ ప్రవేశం!

Published : Nov 22, 2019, 03:10 PM ISTUpdated : Nov 22, 2019, 03:22 PM IST
ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి సినీ రంగ ప్రవేశం!

సారాంశం

పూర్తి వివరాల్లోకి వెళితే.. 'ఢ‌మ‌రుకం' ఫేం దర్శకుడు శ్రీనివాసరెడ్డి రూపొందించిన 'రాగల 24 గంటల్లో' సినిమాలో ఈషా రెబ్బ, సత్యదేవ్, శ్రీరాం ప్రధాన పాత్రలు పోషించారు. 

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీపార్వతి త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయబోతుందని సమాచారం. ఈ విషయాన్ని నటి ముస్కాన్ వెల్లడించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. 'ఢ‌మ‌రుకం' ఫేం దర్శకుడు శ్రీనివాసరెడ్డి రూపొందించిన 'రాగల 24 గంటల్లో' సినిమాలో ఈషా రెబ్బ, సత్యదేవ్, శ్రీరాం ప్రధాన పాత్రలు పోషించారు. అలానే నటి ముస్కాన్ కీలకపాత్రలో నటించింది. ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన తదుపరి సినిమా విశేషాలను పంచుకుంది.

Balakrishna 'రూలర్' టీజర్.. బాలయ్య విగ్గుపై ట్రోలింగ్!

ఆమె 'రాధాకృష్ణ' అనే పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో నటించనుంది. ఈ సినిమాని కూడా శ్రీనివాసరెడ్డినే తెరకెక్కిస్తున్నారు. తెలంగాణా నేపధ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాని లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి కీలకపాత్రలో నటించినట్లు తెలుస్తోంది. లక్ష్మీపార్వతితో కలిసి నటించడం తనకి ఎంతో సంతోషంగా ఉందని ముస్కాన్ తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?