'బలగం'పై నాకు విశ్వాసం ఉంది.. తెలుగు ప్రేక్షకులందనీ కదిలిస్తుంది: కేటీఆర్

Published : Mar 01, 2023, 01:23 AM IST
'బలగం'పై నాకు విశ్వాసం ఉంది.. తెలుగు ప్రేక్షకులందనీ కదిలిస్తుంది: కేటీఆర్

సారాంశం

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వస్తున్న ‘బలగం’ చిత్రానికి కమెడియన్‌గా గుర్తింపు పొందిన వేణు ఎల్డండి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. ఇప్పటికే ప్రివ్యూ షోస్ ద్వారా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘బలగం’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ సిరిసిల్లలో నిర్వహించారు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కి చీఫ్‌ గెస్టులుగా హీరో సిద్ధూ జొన్నలగడ్డని, మంత్రి కేటీఆర్‌ని ఆహ్వానించారు. 

ప్రియదర్శి , కావ్య కళ్యాణ్‌ రామ్ హీరో‌ హీరోయిన్‌గా కమెడియన్‌ జబర్థస్త్ వేణు(వేణు ఎల్డండి )  దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'బలగం'. నిర్మాత దిల్‌ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హర్షిత్, హన్షిత నిర్మించిన ఈ మూవీ ప్రమోషన్స్‌ పనులు ప్రారంభించారు. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కి చీఫ్‌ గెస్టులుగా హీరో సిద్ధూ జొన్నలగడ్డని, మంత్రి కేటీఆర్‌ని ఆహ్వానించారు. 'సిరిసిల్ల'లోని బతుకమ్మ ఘాట్‌ లో ఈ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. భీమ్స్‌ మ్యూజిక్‌ అందించిన ఈ చిత్రం మార్చి 3న విడుదల కానుంది. టీజర్‌, ట్రైలర్‌, ఊరు పల్లెటూరు సాంగ్స్‌ విడుదలతో ప్రమోషన్లు చేయనున్నారు. ఈ సందర్భంగా ఐటీ మినిస్టర్ కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రేక్షకులతో పాటు మూవీ టీమ్‌లో జోష్ నింపారు.

ఈ వేడుకకు హాజరైన ప్రేక్షకులను చూసిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ నేడు బతుకమ్మ ఘాట్ కళకళాడుతోందా.. సిరిసిల్లకు సినిమా వచ్చిందా.. హ్యాపీనా’ అంటూ స్పీచ్ ప్రారంభించారు  ముందుగా దర్శకుడు జబర్థస్త్ వేణును అభినందించారు. తనకు వేణు మంచి కమెడియన్ గానే తెలుసు కానీ.. ఇంత అద్భుతంగా సినిమాను తెరకెక్కిస్తాడని అసలు ఊహించలేదని అన్నారు. కాసర్ల శ్యామ్ పాటలు,భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతాన్ని మెచ్చుకున్నారు. ఇక 'బలగం'సినిమా  గురించి చెప్తూ.. గుండె లోతుల్లోని భావాలను  కూడా చాలా చక్కగా తెరకెక్కించారని, ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని అన్నారు.

అసలూ చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ ఏమీ ఉండవని, అప్పుడప్పుడు తక్కువ బడ్జెట్ లో వచ్చిన చిన్న సినిమాలే.. పెద్ద సినిమాలకు షాకిస్తామని, ఉప్పెనలా ఊపేస్తాయని తెలిపారు. ఇక ఈ చిత్ర నిర్మాతలు హన్షిత్, హర్షితను దిల్ రాజు తొక్కేస్తు్న్నారని సరదాగా వ్యాఖ్యలు చేశారు. అందరూ దిల్ రాజు గురించే మాట్లాడుతున్నారని.. దాన్ని అధిగమించి వారు కూడా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. నాన్న కంటే ఎక్కువ పేరు సంపాదించుకోవాలని వాళ్లిద్దరికీ మంత్రి సూచించారు. అలాగే.. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నో కష్టాలను నోర్చి ఈ వేదికపైకి వచ్చారో భీమ్స్ మాటాలు వింటుంటే .. అర్థమైందని.. మంచి పేరు తెచ్చుకోవాలని అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

అలాగే జ్ఞానపీఠ్ అవార్డ్ అందుకున్న సీ నారాయణరెడ్డి , మిద్దె రాములు వంటి ఎంతో మంది అజ్ఞాత సూర్యులకు ఈ గడ్డ( సిరిసిల్లా) జన్మనిచ్చిందని పేర్కొన్నారు. మొత్తం మీద రాహుల్, ప్రియదర్శి, నవీన్ పొలిశెట్టి, సిద్ధు వంటి నటులు సినిమాల్లో తెలంగాణ భాష మాట్లాడుతుంటే.. గుండెలు ఉప్పొంగుతోందన కేటీఆర్ అన్నారు. ఒకప్పుడు సినిమాల్లో ఎలాంటి ప్రాధాన్యత లేని భాషకు ఇప్పుడు గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి సినిమాలకు ప్రభుత్వం నుంచి సహకారం తప్పకుండా అందిస్తామని హామీనిచ్చారు. మూవీ షూటింగ్స్ కోసం ‘సిరిసిల్ల రాజరాజేశ్వర సాగర్, రంగనాయక సాగర్, కొండ పోచ్మ సాగర్’ వంటి ప్రాంతాలు అనువుగా ఉంటాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ కళాకారుల ప్రతిభను తెర మీద చూపిస్తున్న బలగం మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని  ఆకాంక్షించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?