
Sonu Nigam: ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌పై దాడి జరిగింది. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఆయనపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో సోనూ నిగమ్‌తో పాటు ఓ స్నేహితుడుపై కూడా దాడి జరిగినట్టు సమాచారం. సోనూ నిగమ్ అంగరక్షకుడు అతన్ని రక్షించాడు. ప్రస్తుతం ఆయన చెంబూరులోని జైన్ ఆస్పత్రిలో చేరారట. ఓ మ్యూజికల్ ప్రోగ్రామ్‌లో ఆయనపై ఈ దాడి జరిగింది. సోనూ నిగమ్‌తో సెల్ఫీ దిగుతుండగా తోపులాట జరిగిందని, ఆ తర్వాత సోను నిగమ్‌పై దాడి జరిగిందని ఆరోపించారు. అతడిని చికిత్స నిమిత్తం ముంబైలోని జెన్ ఆసుపత్రికి తరలించారు.
నివేదిక ప్రకారం.. సోమవారం నాడు చెంబూరులో ఓ మ్యూజిక్ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్ లో ప్రదర్శన ఇవ్వడానికి సోనూ నిగమ్ వచ్చారు. ఆయన స్టేజ్‌పై సోనూ నిగమ్ తన బృందంతో కలిసి వస్తుండగా.. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్ చెంబూర్ ఉత్సవంలో సోనూ నిగమ్‌ను కలవాలనుకున్నారు. అతనితో సెల్ఫీలు తీసుకోవడానికి కొంతమంది మెట్లు ఎక్కారు. గాయకుడిని కలవడానికి వారికి అనుమతి నిరాకరించారు. దీంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో అతని సహచరుడు రబ్బానీ ఖాన్ కింద పడేశారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే కుమారుడు, అతని అంగరక్షకులు సోనూ నిగమ్‌తోపాటు అతని స్నేహితుడిని దూషించారని తెలుస్తోంది. ఈ సమయంలో బాడీగార్డ్ వచ్చి సోనూ, అతని స్నేహితుడిని రక్షించాడు. ఇందుకు జరిగిన దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, ముంబై పోలీసుల జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎవరూ గాయపడినట్లు నివేదించబడలేదు. ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని తెలిపారు.
సమీత్ థక్కర్ అనే ట్విట్టర్ హాండిల్ లో దాడికి సంబంధించిన వీడియో ఉంది. “అజాన్ లౌడ్ స్పీకర్లకు వ్యతిరేకంగా గొంతు పెంచిన గాయకుడు సోనూ నిగమ్‌పై ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్యే ప్రకాష్ ఫటర్‌పేకర్, అతని మనుషులు దాడి చేశారు. ఈ దాడి ఆయనే చేసినప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ధారణ లేదు’ అంటూ రాసుకొచ్చారు.