సెన్సార్ దెబ్బకు వాయిదా పడ్డ కార్తికేయ '90ML'

By Prashanth MFirst Published Dec 4, 2019, 3:13 PM IST
Highlights

90ML మూవీ. మందు తాగకపోతే బ్రతకలేని ఒక యువకుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓ వర్గం ఆడియెన్స్ లో ఆసక్తిని కలిగించింది. మొత్తానికి డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకోగా సెన్సార్ నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి.

RX100 సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న కార్తికేయ ఆ తరువాత వరుసగా హిప్పీ - గుణా 369 అనే సినిమాలు రిలీజ్ చేశాడు. అయితే ఆ రెండు సినిమాలు ఈ కుర్ర హీరోకు అనుకున్నంతగా సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఇక ఎలాగైనా ఈ సారి ఆర్ఎక్స్ 100 రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో సిద్దమయ్యాడు.

అదే 90ML మూవీ. మందు తాగకపోతే బ్రతకలేని ఒక యువకుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓ వర్గం ఆడియెన్స్ లో ఆసక్తిని కలిగించింది. మొత్తానికి డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకోగా సెన్సార్ నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి.

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అసలు సమస్య అదేనా..?

అనుకోని కారణాల వల్ల సినిమా సెన్సార్ మంగళవారం పూర్తి కాలేదు. దీంతో విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.  శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సిన 90ML సినిమా ఒకరోజు ఆలస్యంగా శనివారం విడుదల కానుందట.

సినిమా సెన్సార్ పనులకు  ఎలాంటి ఇబ్బంది కలగదని ముందుగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. కానీ సినిమా అనుకోని విధంగా వాయిదా పడాల్సి వచ్చింది. శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కార్తికేయ తన సాథన ప్రొడక్షన్ లో నిర్మించాడు. మరి ఈ సినిమా కుర్ర హీరోకు ఎంతవరకు సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.

click me!