ఈ అవమానాన్ని భరించలేకపోతున్నా.. ప్రముఖ దర్శకుడిపై రచయిత ఆరోపణలు!

Published : Feb 26, 2020, 01:50 PM IST
ఈ అవమానాన్ని భరించలేకపోతున్నా.. ప్రముఖ దర్శకుడిపై రచయిత ఆరోపణలు!

సారాంశం

ప్రముఖ తమిళ రచయిత అజయన్ బాలా రాసి పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తనకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వలేదంటూ అజయన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ప్రస్తుతం 'తలైవి' అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కంగనా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ ఆకట్టుకున్నాయి. ప్రముఖ తమిళ రచయిత అజయన్ బాలా రాసి పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో తనకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వలేదంటూ అజయన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని.. కానీ 'తలైవి' సినిమా విషయంలో తనకు జరిగిన అవమానాన్ని భరించలేకపోతున్నానని అన్నారు.

అనసూయ రేటు ఎంతంటే..? హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!

ఆరు నెలల పాటు ఎంతో శ్రమించి రాసిన నవల ఆధారంగా విజయ్ ఈ సినిమా తీస్తున్నారని.. కోర్టులో ఎవరో కేసు వేస్తే తన నవల అడ్డుపెట్టుకొని కేసు నుండి బయటపడ్డారని.. అలాంటిది తనకు క్రెడిట్ ఇవ్వకుండా పేరు తీసేశారని చెప్పారు.

సినిమాలో కొన్ని అసత్యాలు చూపించారని.. పలువురు రాజకీయనేతలను అవమానించి కొన్ని సన్నివేశాలు తీయడంతో వాటిని తొలగించమని చెప్పానని.. దాంతో తన పేరు తీసేశారని అజయన్ చెప్పుకొచ్చారు.

విజయ్ తో తనకు పదేళ్ల స్నేహం ఉందని.. ఆ స్నేహం కోసం ఎన్నో అవమానాలు భరించానని.. కానీ ఈసారి ఊరుకోలేకపోయయని అన్నారు. ఈ సినిమా కోసం ఏడాదిన్నర స్క్రిప్ట్ రాస్తే తనను వెన్నుపోటు పొడిచాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే అజయన్ దాన్ని సోషల్ మీడియా నుండి తొలగించారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?