ఆ విషయంలో నేను, కొహ్లీ ఒక్కటే : కంగనా

Published : Jan 25, 2020, 05:19 PM IST
ఆ విషయంలో నేను, కొహ్లీ ఒక్కటే : కంగనా

సారాంశం

 ఆమె నటించిన 'పంగా' సినిమా శుక్రవారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. తనకు, కొహ్లికి కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయని చాలా మంది చెప్తుంటారని అన్నారు. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. విరాట్ కి తనకు రెండు విషయాల్లో పోలిక ఉందని బాలీవుడ్ నటి కంగనా  అన్నారు. ఆమె నటించిన 'పంగా' సినిమా శుక్రవారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. తనకు, కొహ్లికి కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయని చాలా మంది చెప్తుంటారని అన్నారు. అది నిజమేనని.. మేమిద్దరం ఎక్కువ వివాదాలు ఎదుర్కొన్నామని అన్నారు.

ఆమెని నిర్భయ దోషులతో కలిపి జైళ్లో ఉంచాలి.. కంగనా ఘాటు వ్యాఖ్యలు!

దీంతో ఎక్కువ మంది అభిమానులను సంపాదించామని చెప్పారు. అంతేకాకుండా కొహ్లికి దూకుడు ఎక్కువ అని విమర్శిస్తుంటారని.. తను కూడా అంతే దూకుడుగా ఉంటానని చెప్పారు. క్రీడాకారుడి జీవితం అంత సులువు కాదని.. ఎన్నో కష్టాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని.. ఆట కోసం వారు ఎంతో సాధన చేస్తారని.. ఫిట్నెస్ కోసం ఎంతో శ్రమిస్తారని కంగనా తెలిపారు.

కాగా కంగనా నటించిన 'పంగా' ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమాలో కంగనా.. జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారిణిగా నటించింది. అశ్వినీ అయ్యర్ తివారి డైరెక్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?