లోకనాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

Published : Nov 07, 2019, 09:49 AM IST
లోకనాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

సారాంశం

ఎలాంటి పాత్ర పోషించినా.. అందులో ఓడిగిపోవడం కొందరికే సాధ్యం. ఆ విద్య బాగా తెలిసిన నటుడు యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్. ఈరోజు నవంబర్ 7న ఆయన పుట్టినరోజు.

ఎలాంటి పాత్ర పోషించినా.. అందులో ఓడిగిపోవడం కొందరికే సాధ్యం. ఆ విద్య బాగా తెలిసిన నటుడు యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్. ఈరోజు నవంబర్ 7న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి విషెస్ చెబుతూ ఆయన నటనావైభవాన్ని గుర్తు చేసుకుందాం. కమల్ నటించిన వందలాది చిత్రాల్లో పలు ప్రయోగాలు చేస్తూ ఆయన అభినయపర్వం
సాగింది.

ఆరు పదుల వయసు దాటినా.. ఇప్పటికీ నటనలో కొత్త ప్రయోగాలు చేయాలని తపిస్తుంటారు కమల్. తాను మెచ్చిన పాత్రను జనాలకు నచ్చే విధంగా నటించడానికి కమల్ ఎంతో శ్రమిస్తారు. అందుకే ఆయన పోషించే పాత్రలు జనాన్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. 

కేవలం నటించడంతోనే తృప్తి చెందని కమల్ దర్శకత్వంలోనూ అడుగు పెట్టి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు నిర్మాతగానూ పని చేయాలని ఆరాట పడుతుంటారు. ఆయన అభినయానికి ఎన్నో అవార్డులు లభించారు.  జాతీయ పురస్కారాల్లో ఉత్తమనటునిగా మూడుసార్లు అవార్డు అందుకున్న తొలి నటునిగా చరిత్ర సృష్టించారాయన.

"మూండ్రం పిరై"తో తొలిసారి నేషనల్ అవార్డు అందుకున్న కమల్, తరువాత "నాయగన్, ఇండియన్" సినిమాలతోనూ మరో రెండు నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. కమల్ హాసన్ నటించిన చిత్రాల్లో జనాన్ని మెప్పించిన చిత్రాలెన్నో ఉండవచ్చు.

అయితే ఆయన మనసుకు నచ్చిన అతికొద్ది సినిమాల్లో తెలుగులో తాను నటించిన 'సాగరసంగమం' చిత్రం ఒకటి. కమల్ తెలుగువాడు కానప్పటికీ తెలుగులో ఆయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన బాణీ పలికిస్తూ సాగిపోతున్న కమల్ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం!

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?