కన్నీటి పర్యంతమైన యంగ్‌ హీరోయిన్‌..!

Published : Mar 28, 2020, 11:03 AM ISTUpdated : Mar 28, 2020, 11:08 AM IST
కన్నీటి పర్యంతమైన యంగ్‌ హీరోయిన్‌..!

సారాంశం

మిరాకిల్‌ ఇన్‌ సెల్‌ నంబర్‌ 7 అనే టర్కిష్ సినిమా చూసిన హీరోయిన్ కళ్యాణీ ఈ సినిమాలోని ఎమోషన్స్‌కు బాగా కనెక్ట్ అయి ఏడ్చేసిందట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది కళ్యాణీ.

కోలీవుడ్ యంగ్ హీరోయిన్‌ కళ్యాణీ ప్రియదర్శన్‌ కన్నీటి పర్యంతమైంది. ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిన ఓ విదేశీ చిత్రం చూసిన ఆమె భావోద్వేగానికి లోనైంది. ఎమోషన్స్‌ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేసింది. అంతేకాదు తన అనుభూతిని, అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది కళ్యాణీ ప్రియదర్శన్. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ సందర్భంగా 21 రోజుల పాటు ఇంటికే పరిమితమవ్వటంతో 21 సినిమాలు చూడాలని నిర్ణయించుకుందట కళ్యాణీ.

అందులో భాగంగా మిరాకిల్‌ ఇన్‌ సెల్‌ నంబర్‌ 7 అనే టర్కిష్ సినిమా చూసింది. ఈ సినిమాలోని ఎమోషన్స్‌కు బాగా కనెక్ట్ అయిన కళ్యాణీ ఏడ్చేసిందట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది కళ్యాణీ. `నేను సాధారణంగా ఇతర సినిమాల గురించి నా సోషల్ మీడియా పేజ్‌లో స్పందించను. కానీ అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరు ఈ సినిమా చూడాలని కోరుతున్నా. ఏ భాష అయినా, ఏ సంస్కృతి అయినా సరే అందరూ అర్ధం చేసుకోగలిగే కథలు చాలా ఉంటాయి. ఇది కూడ అలాంటి సినిమానే. కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ చేయటంతో మనసు సినిమాలు చూసే సమయం దొరికింది.

ఓ సినిమా చూసి నేను ఏడ్చిన విషయం నాకు అసలు గుర్తులేదు. కానీ గురువారం ఈ సినిమా చూశాక కన్నీరు ఆపుకోలేకపోయా. కొంత సమయం ఒంటరిగా ఉండాలనుకున్నా. అందుకే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నా. అందరూ ఈ సినిమా చూడండి` అంటూ కామెంట్ చేసింది కళ్యాణీ. హలో సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ తరువాత చిత్రలహరి, రణరంగం సినిమాల్లో నటించింది. తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తోంది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?